Home
News

Realme Narzo సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర, స్పెసిఫికేషన్లు ,సేల్ వివరాలు

రియల్‌మి సంస్థ భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కొత్తగా లాంచ్ చేసిన ఈ Realme Narzo 70 Turbo అనేది రియల్‌మి నార్జో 70 సిరీస్‌కి అదనంగా వస్తుంది. నార్జో 70 సిరీస్‌ లో Narzo 70x, Narzo 70 మరియు Narzo 70 Pro కూడా ఉన్నాయి.

ఇప్పుడు లాంచ్ అయిన రియల్‌మి నార్జో 70 టర్బో స్మార్ట్‌ఫోన్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లే మరియు మరిన్ని స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని ముఖ్యాంశాలు. కొత్తగా లాంచ్ చేసిన ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Realme Narzo 70 Turbo 5G With Dimensity 7300 Processor 45W Fast Charging Launched  Price Sale Details

Realme Narzo 70 Turbo ఇండియా ధర మరియు లభ్యత వివరాలు
రియల్‌మి నార్జో 70 టర్బో మూడు రంగులలో అందుబాటులో ఉంది: Turbo Yellow, Turbo Green మరియు Turbo Purple రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది మూడు విభిన్న RAM మరియు స్టోరేజ్ కాంబినేషన్‌లలో అందించబడుతుంది: 6GB+128GB, 8GB+128GB మరియు 12GB+256GB. వీటి ధరలు వరుసగా రూ.16,999, రూ.17,999 మరియు రూ.20,999 గా ఉన్నాయి.

ఇది సెప్టెంబర్ 16, మధ్యాహ్నం 12PM నుండి Amazon, Realme యొక్క అధికారిక వెబ్‌సైట్ మరియు రిటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు దీపావళికి ముందు స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 2,000 కూపన్ తగ్గింపును పొందవచ్చు. లాంచ్ ఆఫర్ కింద బడ్స్ ఎయిర్ 5 ను రూ. 1,999 కు పొందండి. వైర్‌లెస్ 3 నియో ని రూ. 999 కి పొందవచ్చు.

Realme Narzo 70 Turbo స్పెసిఫికేషన్ల వివరాలు
రియల్‌మి నార్జో 70 టర్బో స్మార్ట్‌ఫోన్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్‌తో పాటు 12GB వరకు LPDDR4X RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్‌తో అందించబడింది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UI 5.0 పై పనిచేస్తుంది.

ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్ మరియు 2000నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.67-అంగుళాల OLED ఎస్పోర్ట్స్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక 50MP AI కెమెరా ఉంది. ఇది సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది

స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర ఫీచర్లలో Wi-Fi 6, బ్లూటూత్ 5.4, డ్యూయల్ 5G, 3.5mm జాక్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మరియు మరిన్ని ఉన్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Realme Narzo 70 Turbo 5G With Dimensity 7300 Processor,45W Fast Charging Launched. Price,Sale Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X