Home
News

ఐఫోన్ లాంటి కెమెరా డిజైన్ తో రియల్ మీ కొత్త ఫోన్! తక్కువ ధరలో

By Maheswara

రియల్ మీ సంస్థ నుంచి Realme Narzo N53 వచ్చే వారం భారతదేశంలో లాంచ్ చేయబడుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మోడల్‌ను గతంలో కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది కూడా మరియు బుధవారం అమెజాన్ మైక్రోసైట్‌లో లాంచ్ పేజీ కూడా విడుదల చేయబడింది.

ఇప్పుడు, రియల్ మీ ఈ ఫోన్ నిజానికి నార్జో N53 అని ప్రకటించింది. ఇది " ఈ సిరీస్ లో వచ్చిన స్లిమ్మెస్ట్ రియల్ మీ స్మార్ట్‌ఫోన్" అని పేర్కొన్నారు. రియల్ మీ యొక్క ఐదేళ్ల వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కంపెనీ అందించే ఆశ్చర్యకరమైన "ఎంట్రీ లెవల్ రీడిఫైనర్"గా ఈ ఫోన్ ప్రచారం చేయబడింది. ఇంతకుముందు, రియల్‌మే తన Realme C55 కోసం కొత్త రెయిన్‌ఫారెస్ట్ కలర్ వేరియంట్‌ను అదే సందర్భంగా ఆవిష్కరించింది.

Realme Narzo N53 Launch Date Scheduled For May 18th In India. Expected Price And Specifications Details.

రాబోయే ఈ రియల్ మీ నార్జో N53 ఫోన్ 7.49mm మందంతో వస్తుంది. ఇది ఇతర Realme మరియు ఇతర పోటీ హ్యాండ్‌సెట్‌లతో పోల్చితే చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ మే 18న మధ్యాహ్నం 12 PM ISTకి భారతదేశంలో లాంచ్ అవుతుందని ధృవీకరించబడింది. ఇది భారతదేశంలో విడుదల చేయబడిన రెండవ నార్జో N-సిరీస్ ఫోన్. మొదటిది Realme Narzo N55, ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్‌లో మార్కెట్లోకి లాంచ్ చేయబడింది.

మునుపటి నివేదికల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ గురించి కొన్ని స్పెసిఫికేషన్‌లు మరియు ఇతర వివరాలను గమనిస్తే. రియల్ మీ నార్జో N53 రెండు రంగుల ఆప్షన్లలో వస్తుంది. ఇవి ఫెదర్ బ్లాక్ మరియు ఫెదర్ గోల్డ్ రంగులు. ఇప్పటి వరకు, టీజర్‌లు మరియు ప్రచార చిత్రాలలో, ఈ హ్యాండ్‌సెట్ నలుపు మరియు గోల్డెన్ వేరియంట్ రెండింటిలోనూ గుర్తించబడి ఉంది.

రియల్ మీ నార్జో N53 రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ చేయబడుతుందని అంచనా ఉంది. 4GB RAM + 64GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ మరియు 6GB RAM + 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్. ఈ ఫోన్ ధర దాదాపు రూ. 13,000 కు దగ్గర్లో ఉండవచ్చు.ఈ రాబోయే ఫోన్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియవు. ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇక ఈ సిరీస్ లోని ఇతర నార్జో N సిరీస్ ఫోన్ గురించిన వివరాలు తెలుసుకుంటే, Realme Narzo N55 ఫోన్ భారతదేశంలో ప్రైమ్ బ్లాక్ మరియు ప్రైమ్ బ్లూ కలర్‌వేస్‌లో లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందించబడుతుంది - 4GB + 64GB వేరియంట్ ధర రూ. 10,999 మరియు 6GB + 128GB వేరియంట్ రూ. 12,999 గా లాంచ్ అయింది.

ఇంకా, ఈ రియల్ మీ నార్జో N55 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.72 అంగుళాల FHD+ IPS LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. నార్జో N55 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. రియల్ మీ యొక్క తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పైన రియల్ మీ UI 4.0 కస్టమ్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 13లో పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo N53 Launch Date Scheduled For May 18th In India. Expected Price And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X