Realme Narzo N53 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ వేరియంట్ విడుదల.. ధర, సేల్ వివరాలు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ తన ఫోన్ Realme Narzo N53 కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను ఈ సంవత్సరం మే లో లాంచ్ చేసింది. విడుదల సమయంలో రెండు వేరియంట్లలో విడుదల అయింది. తాజాగా 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను విడుదల చేసింది.
రియల్‌మీ నార్జో N53 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ వేరియంట్ ఫెదర్ బ్లాక్, ఫెదర్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాల యూనిట్‌ను కలిగి ఉంటుంది. మరియు వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

రియల్‌మీ నార్జో N53 ధర : రియల్ మీ నార్జో N53 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7999గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9499గా ఉంది. అదే తాజాగా విడుదల 8GB ర్యామ్+ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది.
రియల్‌మీ నార్జో N53 స్పెసిఫికేషన్లు : రియల్‌మీ నార్జో N53 స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90 Hz రీఫ్రెష్ రేట్, 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. 90:3 స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంటుంది.
రియల్‌మీ నార్జో N53 స్మార్ట్ ఫోన్ ఆక్టా కోర్ unisoc T612 SoCతో ARM Mail-G57 GPUపై పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ UI 4.0 పైన పనిచేస్తుంది. దీంతోపాటు రియల్‌మీ మినీ క్యాప్సుల్ కూడా ఉంటుంది.
రియల్‌మీ నార్జో N53 కెమెరాలు : ఈ నార్జో 50 స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 50MP ప్రైమరీ కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 33W వైరడ్ సూపర్‌వాక్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఫలితంగా 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.

నార్జో N53 సేల్ వివరాలు : ఈ రియల్‌మీ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు బ్లూటూత్ 5.0, 4G, GPS సహా USB-C కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తుంది. ఈ కొత్త వేరియంట్‌ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 25 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్ కింద రూ.2 వేల తగ్గింపును పొందవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








