రియల్ మీ నార్జో N55 మొదటి సేల్ ఈరోజే! ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లు
భారతదేశంలో రియల్ మీ సంస్థ నుంచి గత వారం లాంచ్ అయిన రియల్ మీ నార్జో N55 సేల్ ఈరోజు మొదలవుతుంది. రియల్ మీ నార్జో N55 ఇటీవలే భారతదేశం యొక్క సరసమైన ఫోన్ విభాగంలో ప్రవేశించింది. ఇది మీడియా టెక్ చిప్‌సెట్, పెద్ద బ్యాటరీ, డ్యూయల్-రియర్ కెమెరాలు, తాజా సాఫ్ట్‌వేర్ మరియు అధిక రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లేతో వస్తుంది.
రియల్ మీ నార్జో N55 భారతదేశంలో ఈరోజు మధ్యాహ్నం 12:00 గంటలకు సేల్ మొదలుకాబోతోంది. రియల్ మీ యొక్క ఈ తాజా సరసమైన స్మార్ట్‌ఫోన్ Realme.com మరియు అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా HDFC మరియు SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1,000 వరకు తగ్గింపు ఆఫర్ ను పొందవచ్చు.

భారతదేశంలో రియల్ మీ నార్జో N55 ధర వివరాలు గమనిస్తే, ఈ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ 4GB/64GB మోడల్ కోసం రూ.10,999 నుండి ప్రారంభమవుతుంది. అదనంగా, 6GB/128GB వేరియంట్ ధర మీకు రూ.12,999 గా నిర్ణయించబడింది. రియల్ మీ నార్జో N55 ప్రైమ్ బ్లూ మరియు ప్రైమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది.
నార్జో N55 స్మార్ట్ ఫోన్, ప్రముఖ ఐఫోన్ 14 ప్రో యొక్క ఫీచర్ అయిన డైనమిక్ ఐలాండ్ లాంటి మినీ క్యాప్సూల్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్‌తో కలిసి రూపొందించబడింది మరియు ఇది 7.89 మిమీ మందంతో సెగ్మెంట్‌లో అత్యంత సన్నని ఫోన్ గా ఉంటుంది.
రియల్ మీ నార్జో N55 స్పెసిఫికేషన్ ల వివరాలు,
ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో G88 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇందులో 6GB వరకు RAMతో జత చేయబడింది. మరియు ఈ ఫోన్ 64GB మరియు 128GB eMMC 5.1 స్టోరేజీ తో వస్తుంది. దీనికి మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీ ని విస్తరించవచ్చు. అదనంగా, Realme యొక్క డైనమిక్ RAM ఫీచర్ ద్వారా 6GB వరకు RAM ఉపయోగించని నిల్వను వర్చువల్ RAMగా ఉపయోగించవచ్చు.
ఇంకా, ఈ రియల్ మీ నార్జో N55 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.72 అంగుళాల FHD+ IPS LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. నార్జో N55 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. రియల్ మీ యొక్క తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పైన Realme UI 4.0 కస్టమ్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 13లో పనిచేస్తుంది.
ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, ఈ ఫోన్ 64 MP ప్రైమరీ కెమెరా సెన్సార్ మరియు 2 MP B&W లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇంకా, ముందు భాగంలో, హోల్-పంచ్ కటౌట్‌లో 8 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ పరికరంలోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications