Realme Narzo N61 మొదటి సేల్ ఈరోజే! రూ.6999 కే కొనండి, సేల్ ఆఫర్ వివరాలు
Realme కంపెనీ ఇటీవలే కొత్త Realme Narzo N61 ఫోన్‌ను విడుదల చేసింది. ఇది 'నార్జో' సిరీస్‌లో విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్. బడ్జెట్ విభాగంలో కంపెనీ ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ఈ రోజు ఆగస్టు 6 మధ్యాహ్నం 12 నుంచి అమెజాన్ లో మొదటగా సేల్ కు రానుంది.
Realme Narzo N61 ధర మరియు సేల్ ఆఫర్ వివరాలు
ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 4GB RAM + 64GB స్టోరేజ్ ధర రూ. 7,499 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 8,499 గా ఉంది ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 7,000 కంటే తక్కువకు కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పించింది. ఈ ఫోన్ వాయేజ్ బ్లూ మరియు మార్బుల్ బ్లాక్ రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Amazon సేల్ ఆఫర్ లో రూ. 6,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు
Realme Narzo N61 ఫోన్‌ను Realme యొక్క అధికారిక వెబ్‌సైట్ మరియు Amazon ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ లాంచ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. రూ. 500 కూపన్ తగ్గింపుతో తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. డిస్కౌంట్ తర్వాత కేవలం రూ.6,999 ప్రారంభ ధరతో ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Realme Narzo N61 స్పెసిఫికేషన్ల వివరాలు
ఈ ఫోన్ 6.74-అంగుళాల HD+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1600 x 720 పిక్సెల్ రిజల్యూషన్, 90hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ మరియు 560nits గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఈ ఫోన్ మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్‌తో లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ యూనిసోక్ T612 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
Realme Narzo N61 ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది. ఫోన్ 4GB మరియు 6GB RAM మరియు 64GB మరియు 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌లో 6GB డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ ఉంది. ఇది 2TB మెమరీ కార్డ్‌కు మద్దతు ఇస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 32MP సూపర్ క్లియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 5MP మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. ఇది USB టైప్ C పోర్ట్ మరియు 10W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంది.
అలాగే Realme Narzo N61 ఫోన్‌లో AI బూస్ట్ ఇంజన్ ఉంది. ఇది బ్లూటూత్ 5.0 మరియు 5GHz Wi-Fi టెక్నాలజీతో పాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు IP54 రక్షణను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








