Home
News

6GB RAM, 5000mAh బ్యాటరీ, 32MP కెమెరాతో Realme Narzo N61 లాంచ్! రూ.6999 కే కొనండి

Realme సంస్థ భారతదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు విడుదల చేసింది. కొత్తగా లాంచ్ అయిన Realme Narzo N61 ఫోన్ రియల్‌మి యొక్క Narzo సిరీస్‌ లో కొత్త ఫోన్. ఈ సిరీస్ లో ఇటీవల ప్రారంభించబడిన N63 మరియు N65 స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉన్నాయి. రియల్‌మి నార్జో N61 ఇంటిగ్రేటెడ్ మెటాలిక్ ఫ్రేమ్, రీన్‌ఫోర్స్డ్ గ్లాస్ మరియు IP54 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ యునిసోక్ చిప్‌సెట్, డ్యూయల్ 4G స్టాండ్‌బై, 32MP ప్రధాన కెమెరా మరియు 5MP ఫ్రంట్ కెమెరా వంటివి స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్లు కలిగి ఉంది. కొత్తగా ప్రారంభించిన రియల్‌మి నార్జో N61 స్మార్ట్‌ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Realme Narzo N61 sale date

Realme Narzo N61 ఇండియా ధర మరియు సేల్ వివరాలు
రియల్‌మి నార్జో N61 స్మార్ట్‌ఫోన్ నీలం మరియు నలుపు రంగులలో లభిస్తుంది. ఇది రెండు విభిన్న RAM మరియు స్టోరేజ్ కాంబినేషన్‌తో అందించబడుతుంది: 4GB+64GB మరియు 6GB+128GB వేరియంట్ లలో వస్తుంది. వీటి ధర రూ.7,499 మరియు 8,499 గా ఉంది. కొత్తగా లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ఆగస్టు 6, మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అన్ని వేరియంట్‌లపై ఫ్లాట్ రూ. 500 తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ తో స్మార్ట్‌ఫోన్ యొక్క ధర 4GB+64GB వేరియంట్‌కు రూ.6,999 కి మరియు 6GB+128GB వేరియంట్‌కు రూ.7,999 కి తగ్గిస్తుంది.

Realme Narzo N61 స్పెసిఫికేషన్ల వివరాలు
రియల్‌మి నార్జో N61 స్మార్ట్‌ఫోన్ యూనిసోక్ T612 చిప్‌సెట్‌తో పాటు 6GB వరకు RAM మరియు 128GB స్టోరేజ్‌తో అందించబడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ UIపై పనిచేస్తుంది. ఇది 1600x720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లే, 90Hz వరకు రిఫ్రెష్ రేట్ మరియు 560 nits గరిష్ట ప్రకాశం కలిగి ఉంటుంది.

కెమెరా వివరాలు గమనిస్తే,ఇది వెనుకవైపు 32MP ప్రధాన కెమెరా మరియు సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 5MP ఫ్రంట్ కెమెరాను పొందుతుంది. ఇది 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం, ఇది డ్యూయల్ 4G స్టాండ్‌బై, 2.4GHz / 5GHz Wi-Fi, బ్లూటూత్ 5.0, 3.5mm హెడ్‌సెట్ జాక్ ఫీచర్లు కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo N61 With 6GB RAM, 5000mAh Battery And 32MP Camera Launched In India. Priced At Rs.7499
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X