Realme Narzo N65 5G సేల్ ఈ రోజే! ధర, సేల్ ఆఫర్ వివరాలు
రియల్‌మి నుంచి Realme Narzo N65 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఈ రోజు భారతదేశంలో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ రియల్‌మి నార్జో N65 5G దేశంలోని ధర రూ.10000 ల విభాగంలో గత వారం భారతదేశంలో లాంచ్ చేయబడింది. నార్జో N65 అత్యంత అందుబాటులో ఉన్న ధర వద్ద శక్తివంతమైన పనితీరును అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అద్భుతమైన హార్డ్‌వేర్‌తో పాటు,ఈ ఫోన్ మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్, ఎయిర్ గెస్చర్ సపోర్ట్ మరియు డైనమిక్ బటన్ ఫీచర్ తో కూడా వస్తుంది.
భారతదేశంలో Realme Narzo N65 5G సేల్ వివరాలు
భారతదేశంలో రియల్‌మి నార్జో N65 5G ధర బేస్ 4GB/128GB మోడల్ కోసం రూ.11,499 నుండి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా, ఈ హ్యాండ్‌సెట్ 6GB/128GB కాన్ఫిగరేషన్‌లో కూడా వస్తుంది, దీని ధర రూ.12,499. ఈ రియల్‌మి నార్జో N65 5G ఫోన్ అంబర్ గోల్డ్ మరియు డీప్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది.

రియల్‌మి యొక్క ఈ కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, realme.com మరియు ఇతర ప్రముఖ రిటైలర్‌ల ద్వారా భారతదేశంలో సేల్ చేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు డిస్కౌంట్ కూపన్ ద్వారా రూ. 1,000 ఫ్లాట్ తగ్గింపు ఆఫర్ ను పొందవచ్చు.
Realme Narzo N65 5G స్పెసిఫికేషన్ల వివరాలు
రియల్‌మి నార్జో N65 5G, మీడియా టెక్ డైమెన్సిటీ 6300 SoC ద్వారా 6GB వరకు LPDDR4X RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్‌తో జత చేయబడి, మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజీ విస్తరించవచ్చు.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత Realme UI 5.0 ని బాక్స్ తో పాటుగా వస్తుంది.
ఇక కెమెరా, ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, నార్జో N65 5G ఫోన్ 50MP శాంసంగ్ JN1 ప్రైమరీ సెన్సార్ మరియు 2MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. రియల్‌మి నార్జో N65 5G USB టైప్-C పోర్ట్ ద్వారా 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 264ppi పిక్సెల్ సాంద్రతతో 6.67-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా, దీని డిస్ప్లే TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేట్ పొందింది మరియు రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇక కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, బ్లూటూత్ 5.3, Wi-Fi, 5G, GPS, 3.5mm ఆడియో జాక్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








