Home
News

అత్యంత తక్కువ ధరకే రియల్‌మి Note 50 స్మార్ట్‌ఫోన్‌.. 5000mAh బ్యాటరీ సహా కీలక ఫీచర్లు..!

రియల్‌మి తన ఫోర్ట్‌ఫోలియోను క్రమంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి నోట్‌ మోడల్‌ను విడుదల చేసింది. రియల్‌మి నోట్‌ 50 ( Realme Note 50 ) పేరిట లాంచ్‌ చేసింది. ఈ నోట్‌.. రియల్‌మి C53 తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు Unisoc చిప్‌సెట్‌తో HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్కై బ్లూ, మిడ్‌నైట్‌ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

రియల్‌మీ నోట్‌ 50 స్పెసిఫికేషన్లు : రియల్‌మీ నోట్‌ 50 స్మార్ట్‌ఫోన్ 6.47 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. 720*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా 560 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంది. ఆకట్టుకొనే వెనుక ప్యానల్‌తో వచ్చింది.

 realme-note-50-launched-with 5000mAh battery

2TB వరకు స్టోరేజీ పెంచుకొనే అవకాశం : ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆక్టా కోర్‌ unisoc T612 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 4GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. రియల్‌మి నోట్‌ 50 హ్యాండ్‌సెట్‌ 64GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని 2TB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మి UT ఎడిషన్‌ OS తో పని చేస్తుంది.

రియల్‌మి నోట్‌ 50 స్మార్ట్‌ ఫోన్‌ కెమెరాలు : రియల్‌మి నోట్‌ 50 స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటాయి. 13MP ప్రధాన కెమెరా సహా డెప్త్‌ సెన్సార్‌తో వస్తుంది. వెనుకవైపు LED ప్లాష్‌ను అమర్చారు. వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ ముందువైపు 5MP కెమెరాను కలిగి ఉంటుంది.

 realme-note-50-launched-with 5000mAh battery

రియల్‌మి నోట్‌ 50 స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ ప్యాక్‌ : ఈ స్మార్ట్‌ఫోన్ 10W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్‌, స్ప్లాష్‌ రెసిస్టెన్స్‌తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంటుంది. మరియు డ్యూయల్‌ సిమ్‌ను సపోర్టు చేస్తుంది.

భారత్‌లో ఎప్పుడు లాంచ్‌ కానుందంటే ? : ప్రస్తుతానికి ఈ రియల్‌మి నోట్ 50 పిలిప్పెన్స్‌లో మాత్రమే విడుదల అయింది. ధర 3599 పిపిప్పెని పెసో (భారత కరెన్సీ ప్రకారం రూ.5325) గా ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌లోకి ఎప్పుడు విడుదల కానుందనే సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇదే ధర, ఫీచర్లను కలిగి ఉంటుందా లేదా అదనపు ఫీచర్లు, వేరియంట్లను కూడా విడుదల చేయనుందా అనే సమాచారం వెల్లడికాలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme note 50 launched with 5000mAh battery and key features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X