Realme Pad Mini ఇండియాలో అధికారిక లాంచ్‌కు ముందే టీజర్ విడుదలైంది!!
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి ఇండియాలో స్మార్ట్‌ఫోన్లతో పాటుగా లాప్ టాప్ మరియు టాబ్లెట్ విభాగంలో కూడా తన యొక్క హవాను కొనసాగిస్తోంది. ఈ సంస్థ భారతదేశంలో 2021లో మొదటిసారిగా రియల్‌మి ప్యాడ్ ని ప్రారంభించి టాబ్లెట్ విభాగంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఈ కంపెనీ త్వరలోనే దేశంలో రియల్‌మి ప్యాడ్ మిని పేరుతో మరొక బడ్జెట్ టాబ్లెట్‌ను విడుదల చేయనున్నది. ఈ విడుదలకు సంబందించిన వివరాలతో కూడిన టీజర్ ని ఫ్లిప్‌కార్ట్ మరియు దాని స్వంత వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి ప్యాడ్ మినికి సంబందించిన టీజర్ లోని వివరాలను పరిశీలిస్తే సంస్థ కొత్త ట్యాబ్ గురించి పెద్దగా వెల్లడించలేదు. కానీ రాబోయే రియల్‌మి ప్యాడ్ మిని ట్యాబ్ మాత్రం 'మెగా బ్యాటరీ'తో వస్తుందని చెప్పింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రియల్‌మి ఇండియా యొక్క వైస్ ప్రెసిడెంట్ మాధవ్ షేత్ యొక్క తాజా ప్రకటనలో భాగంగా కంపెనీ త్వరలో రియల్‌మి ప్యాడ్ మినీని ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు తెలిపిన కొద్దిసేపటికే ఈ టీజర్ విడుదలైంది. ఈ రియల్‌మీ ప్యాడ్ మినీ టాబ్లెట్ గురించి మనం వినడం ఇది మొదటిసారి కాదు. కంపెనీ ఇప్పటికే దీనిని ఫిలిప్పీన్స్‌లో కూడా విడుదల చేసింది.

రియల్‌మి ప్యాడ్ మిని స్పెసిఫికేషన్స్
రియల్‌మి యొక్క ఫిలిప్పీన్స్ వెబ్‌సైట్‌లో జాబితా చేయబడిన కొత్త రియల్‌మి ప్యాడ్ మిని టాబ్లెట్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 1,340×800 పిక్సెల్ రిజల్యూషన్‌తో మరియు 84:59 స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 8.7-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది Mali-G57 MP1 GPUతో Unisoc T616 సిస్టమ్-ఆన్-చిప్ ద్వారా శక్తిని పొందుతూ గరిష్టంగా 4GB RAM మరియు 64GB వరకు UFS 2.1 స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ని ఉపయోగించి మెమొరీని 1TB వరకు విస్తరించవచ్చు. ఇది రియల్‌మి UI మరియు ఆండ్రాయిడ్ 11తో రన్ అవుతుంది.

ఆప్టిక్స్ విభాగం విషయానికి వస్తే రియల్‌మి ప్యాడ్ మిని కొత్త టాబ్లెట్ ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ కెమెరా మరియు వెనుకభాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరాను జతచేయబడి వస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 6,400mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో ఇది 4G మరియు WiFiని కలిగి ఉంది. ఇతర ఫీచర్లలో స్టీరియో స్పీకర్లు మరియు మైక్రోఫోన్ ఉన్నాయి.

భారతదేశంలో రియల్‌మి సంస్థ ఏప్రిల్ 29న రియల్‌మి GT నియో 3ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా రియల్‌మి ప్యాడ్ మిని టాబ్లెట్ ని వచ్చే వారం భారతదేశంలో విడుదల చేసే అవకాశం ఉంది. రియల్‌మి GT నియో 3 కొత్త ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది MediaTek డైమెన్సిటీ 8100 SoC, 50MP ప్రైమరీ కెమెరా మరియు 5,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications