Realme ప్యాడ్ టాబ్లెట్ స్పెసిఫికేషన్స్, డిజైన్ టీజ్ చేయబడ్డాయి!! వివరాలు ఇవిగో
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ భారత మార్కెట్లోకి తన యొక్క రియల్‌మి ప్యాడ్ ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నది. ఈ రియల్‌మి ప్యాడ్ యొక్క ముఖ్యమైన వివరాలలో ప్రత్యేకంగా డిస్‌ప్లే వివరాలను తెలుపుతూ కొన్ని లీక్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రియల్‌మి ప్యాడ్ టాబ్లెట్ యొక్క ముందు మరియు వెనుకవైపు గల డిజైన్ వివరాలు ఫ్లిప్‌కార్ట్ పేజీ ద్వారా టీజ్ చేయబడ్డాయి. రియల్‌మి ప్యాడ్ మొత్తం రెండు కెమెరాలను కలిగి ఉంది. వెనుక వైపు సింగిల్ కెమెరాను మాత్రమే కలిగి ఉంది అలాగే సెల్ఫీల కోసం కూడా సింగల్ కెమెరాను కలిగి ఉంది. ఇది 6.9mm సన్నని బెజెల్ ప్రొఫైల్ నిర్మాణంను కలిగి ఉంది. ఈ లీక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్ టీజర్ పేజీ ప్రకారం రియల్‌మి ప్యాడ్ 10.4-అంగుళాల ఫుల్‌స్క్రీన్ WUXGA+ డిస్‌ప్లే 2,000x1,200 రిజల్యూషన్ మరియు 82.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో రానున్నది. గతంలో ఇది 6.9mm సన్నని బెజెల్ నిర్మాణ ప్రొఫైల్‌తో రానున్నట్లు టీజ్ చేయబడింది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్‌లో జతచేయబడిన రెండర్లు టాబ్లెట్‌కు అన్ని వైపులా బెజెల్‌లను సూచిస్తాయి. ఫ్రంట్ కెమెరా టాప్ బెజెల్‌లో కలిగి ఉంది. అలాగే వెనుకవైపు రియల్‌మి ప్యాడ్ ఎగువ మూలలో ఒకే కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది వెనుక ప్యానెల్ లో గుండ్రని సన్నని గీత నిర్మాణంను మరియు పొడవైన అంచుకు సమాంతరంగా కలిగి ఉంటుంది. రియల్‌మి ప్యాడ్ గోల్డ్ ఫినిషింగ్‌లో కనిపిస్తుంది. అయితే గత లీక్‌లు టాబ్లెట్ గ్రే ఫినిష్‌లో కూడా రావచ్చని సూచిస్తున్నాయి. రియల్‌మి లోగో వెనుక ప్యానెల్ యొక్క ఒక మూలలో ఎంబోస్ చేయబడింది.

రియల్‌మి ప్యాడ్ లాంచ్ ఈవెంట్ ఇండియాలో సెప్టెంబర్ 9 న మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది లైవ్ ద్వారా అందరూ చూడవచ్చు. ట్విట్టర్‌లో టీజర్ స్పీకర్ గ్రిల్ మరియు USB పోర్ట్ దిగువ అంచున ఉన్నట్లు చూపుతుంది. ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో గుండ్రని మూలలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.

రియల్‌మి ప్యాడ్ ముందు భాగంలో మరియు వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ని కలిగి ఉంది. ఈ రెండింటిలో 1.36-అంగుళాల సెన్సార్‌లు f/2.8 ఎపర్చరు, 2.8 మిమీ ఫోకల్ లెంగ్త్, ఇమేజ్ స్టెబిలైజేషన్ మరియు 65.3 డిగ్రీ ఫీల్డ్‌తో ఉండవచ్చు. ఆఫ్-వ్యూ (FoV) రెండు కెమెరాలు 3,264x2,448 పిక్సెల్స్ రిజల్యూషన్‌లో ఫోటోలను తీయగలవని భావిస్తున్నారు. రియల్‌మి ప్యాడ్‌లో అల్యూమినియం యూనిబోడీ నిర్మాణం, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ మరియు స్టైలస్ కోసం హౌసింగ్ ఉండవచ్చునని గత లీకులు సూచిస్తున్నాయి.

రియల్‌మి ల్యాప్‌టాప్
రియల్‌మి కంపెనీ ఇండియాలో ఇటీవల తన తొలి ల్యాప్‌టాప్ మోడల్‌గా రియల్‌మి బుక్ స్లిమ్ ను లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ 2K డిస్‌ప్లేను కలిగి ఉండి 11వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. ఈ రియల్‌మి బుక్ స్లిమ్ ల్యాప్‌టాప్ 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఇరుకైన బెజెల్‌లతో రూపొందించబడి మరియు రెండు విభిన్న కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. అదనంగా ల్యాప్‌టాప్ లీగ్ ఆఫ్ లెజెండ్స్, ఓవర్‌వాచ్ మరియు షాడో ఆఫ్ ది టోంబ్ రైడర్ వంటి గేమ్ లను ఆడటానికి అనువుగా ఉంటుంది అని రియల్‌మి పేర్కొంది. ఈ ల్యాప్‌టాప్‌లో వై-ఫై 6 మరియు థండర్‌బోల్ట్ 4 వంటి తాజా కనెక్టివిటీ ఎంపికలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications