Just In
- 6 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 8 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 11 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 13 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
భూమిపై అత్యధిక కాలంగా జీవిస్తున్న కుక్కగా ‘బోబీ’ గిన్నీస్ వరల్డ్ రికార్డ్
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ మొదటి సేల్‌లో రూ.2000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు...
భారతదేశం మార్కెట్ లో మంచి స్థానం కలిగిన రియల్‌మి స్మార్ట్‌ఫోన్ కంపెనీ గత నెల చివరిలో ఇండియాలో రియల్‌మి ప్యాడ్ X పేరుతో కొత్త టాబ్లెట్ ని లాంచ్ చేసింది. ఇండియాలో లాంచ్ అయిన ఒక వారం తర్వాత ఈ టాబ్లెట్ ఈరోజు భారతదేశంలో వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. రియల్‌మి కంపెనీ యొక్క ఈ తాజా టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా రన్ అవుతూ 5G కనెక్టివిటీతో లభించే మొదటి టాబ్లెట్ కావడం విశేషం.

11-అంగుళాల WUXGA+ రిజల్యూషన్ డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్ సెటప్, 13-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 105-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8,340mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్ల కలయికతో ప్యాక్ చేయబడిన ఈ టాబ్లెట్ యొక్క మొదటి సేల్స్ లో ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్ చాలానే ఉన్నాయి. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ ధరల వివరాలు
రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ భారతదేశంలో కొనుగోలు చేయడానికి మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో Wi-Fi కనెక్టివిటీతో లభించే 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ మోడల్ రూ.19,999 ధర వద్ద, 5G కనెక్టివిటీ సామర్థ్యం గల ఇదే మోడల్ రూ.25,999 ధర వద్ద మరియు చివరిగా 5G కనెక్టివిటీతో లభించే 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ రూ.27,999 ధర వద్ద కొనుగోలు చేయడం కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ టాబ్లెట్ ఫ్లిప్‌కార్ట్, Realme.com మరియు ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా గ్లేసియర్ బ్లూ మరియు గ్లోయింగ్ గ్రే కలర్ ఆప్షన్‌లలో నేటి నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ సేల్స్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్‌లో నేడు ప్రారంభమయ్యే మొదటి సేల్‌లో SBI మరియు HDFC బ్యాంక్ కార్డ్లను ఉపయోగించి చేసే లావాదేవీలపై రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. డిస్కౌంట్ పొందిన తరువాత 4GB+64GB (WiFi) వేరియంట్‌ని రూ.17,999కి, 4GB+64GB (WiFi మరియు 5G) వేరియంట్‌ని రూ.23,999కి మరియు 6GB+128GB వేరియంట్‌ని రూ.25,999 ప్రభావవంతమైన తగ్గింపు ధరల వద్ద కొనుగోలు చేయవచ్చు. అదనంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించే కొనుగోలుదారులు అదనంగా ఐదు శాతం వరకు క్యాష్‌బ్యాక్ ను కూడా పొందుతారు. అదనంగా టాబ్లెట్‌ను కొనుగోలు చేయడం ద్వారా కొనుగోలుదారులందరూ యూట్యూబ్ ప్రీమియం యొక్క మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు.

రియల్‌మి పెన్సిల్, స్మార్ట్ కీబోర్డ్
ఇండియాలో రియల్‌మి పెన్సిల్ రూ.5,499 ధర వద్ద లాంచ్ కాగా రియల్‌మి స్మార్ట్ కీబోర్డ్ రూ.4,999 ధర వద్ద విడుదలైంది. రియల్‌మి బ్రాండ్ యొక్క ఈ రెండు ఉపకరణాలు భారతదేశంలో ఎప్పుడు విక్రయించబడతాయో కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇవే కాకుండా రియల్‌మి ఫ్లాట్ మానిటర్ ని కూడా రూ.12,999 ధర వద్ద లాంచ్ చేసింది. ఇది జూలై 29 నుంచి Flipkart, Realme.com ద్వారా రూ.10,999 తగ్గింపు ధరతో బ్లాక్ కలర్ ఆప్షన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ స్పెసిఫికేషన్స్
రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 12-ఆధారిత రియల్‌మి UI 3.0పై రన్ అవుతుంది. ఇది WUXGA+ (1,200x2,000 పిక్సెల్‌ల) రిజల్యూషన్‌తో 11-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా రన్ అవుతూ గరిష్టంగా 6GB RAMతో జత చేయబడి ఉంటుంది. అలాగే మెరుగైన పనితీరు కోసం ఈ టాబ్లెట్ 5GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను వర్చువల్ RAMగా ఉపయోగించడానికి అనుమతిస్తుంది. రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ యొక్క ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాను అమర్చబడి వస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం టాబ్లెట్ ముందుభాగంలో 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 105-డిగ్రీల ఫీల్డ్ వ్యూతో వస్తుంది.

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్‌లో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్టుతో నాలుగు స్పీకర్లను అమర్చారు. Realme Pad X 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 8,340mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ కూడా తక్కువ-లేటెన్సీ రియల్‌మి పెన్సిల్‌కు మద్దతును ఇస్తుంది. ఇది నోట్ లను గీయడానికి మరియు తీసుకోవడానికి ఉపయోగించబడుతుంది మరియు 10.6 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. టాబ్లెట్ రియల్‌మి స్మార్ట్ కీబోర్డ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది 1.3mm కీ ప్రయాణ దూరాన్ని కలిగి ఉంది మరియు మల్టీ టాస్కింగ్ కోసం వివిధ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు మరియు కాంబినేషన్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ డివైస్ లు విడిగా కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470