Realme Pad X ఇండియా లాంచ్ పై కీలక ప్రకటనలు విడుదల చేసిన రియల్‌మి వైస్ ప్రెసిడెంట్
రియల్‌మి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మాధవ్ షేత్ రియల్‌మి ప్యాడ్ X ఇండియా లాంచ్‌కు సంబందించిన వివరాలను ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. కంపెనీ యొక్క ఈ తాజా టాబ్లెట్ గురువారం చైనాలో లాంచ్ చేయబడింది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా రన్ అవుతూ 6GB వరకు RAMతో జత చేయబడి వస్తుంది. ఇది 11-అంగుళాల 2K డిస్‌ప్లేను కలిగి ఉండి వెనుక భాగంలో క్వాడ్ స్పీకర్ సెటప్‌తో పాటుగా 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,340mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. భారతదేశంలో ఈ టాబ్లెట్‌ను ఎప్పుడు ప్రారంభించనున్నదో వంటి వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీనికి సంబందించిన వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ ధరల వివరాలు
రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ చైనాలో లాంచ్ చేసిన కొద్దిసేపటికే రియల్‌మి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మాధవ్ షేత్ గురువారం ట్వీట్‌ను విడుదల చేసారు. ఇండియాలో రియల్‌మి ప్యాడ్ Xను ప్రారంభించాలనుకుంటున్నారా అని వినియోగదారులు అడిగిన ప్రశ్నకు అదనంగా పోస్ట్‌పై 300 రీట్వీట్లు రావడంతో "మేము దీనిని భారతదేశానికి తీసుకువస్తాము!" కంపెనీ తన సరికొత్త ట్యాబ్లెట్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టే యోచనలో ఉందని సూచిస్తూ షెత్ పేర్కొన్నారు. రియల్‌మి ప్యాడ్ X ప్రస్తుతం చైనాలో బ్రైట్ గ్రీన్ చెస్‌బోర్డ్, సీ సాల్ట్ బ్లూ మరియు స్టార్ గ్రే కలర్ ఆప్షన్‌లలో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. ఇది బేస్ 4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ CNY 1,299 (దాదాపు రూ. 15,000) ధర వద్ద మరియు 6GB RAM + 128GB వేరియంట్ CNY 1599 (దాదాపు రూ. 18,400) ధరల వద్ద లభిస్తుంది.
#realmePadX has been launched in China. Do you all want it to be launched in India as well?
— Madhav Sheth (@MadhavSheth1) May 26, 2022
300 retweets on this post and we will bring it to India! pic.twitter.com/28ITzZHCCy
రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ స్పెసిఫికేషన్స్
రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది రియల్‌మి UI 3.0పై రన్ అవుతుంది. ఈ టాబ్లెట్ 11-అంగుళాల 2K రిజల్యూషన్ LCD డిస్‌ప్లేను 2,048 x 1,080 పిక్సెల్‌లు, 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు DC డిమ్మింగ్ సపోర్ట్‌తో కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా శక్తిని పొందుతూ గరిష్టంగా 6GB RAMతో జత చేయబడి లభిస్తుంది. ఈ టాబ్లెట్ 5GB వరకు వినియోగించని ఇంటర్నల్ స్టోరేజ్ ని ఉపయోగించి అందుబాటులో ఉన్న మెమరీని 11GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది.

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చబడి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం 105-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో ఫ్రంట్-ఫేసింగ్ 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. అలాగే ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. టాబ్లెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.0 మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది Realme మాగ్నెటిక్ స్టైలస్ మరియు స్మార్ట్ కీబోర్డ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. టాబ్లెట్ క్వాడ్ స్పీకర్లు మరియు డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,340mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కంపెనీ ప్రకారం, Realme Pad X 7.1mm మందం మరియు 499 గ్రాముల బరువు ఉంటుంది.


Click it and Unblock the Notifications








