Realme Pad X టాబ్లెట్‌లో గల ప్రత్యేకతలు!! అందుబాటు ధరలో లాంచ్...

|

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ లో మంచి స్థానం కలిగిన రియల్‌మి కంపెనీ నేడు ఇండియాలో రియల్‌మి ప్యాడ్ X పేరుతో కొత్త టాబ్లెట్ ని విడుదల చేసారు. రియల్‌మి కంపెనీ యొక్క ఈ తాజా టాబ్లెట్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా శక్తిని పొందుతూ 5G కనెక్టివిటీని అందించే రియల్‌మి బ్రాండ్ యొక్క మొదటి టాబ్లెట్. 11-అంగుళాల WUXGA+ రిజల్యూషన్ డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్ సెటప్‌, 13-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 105-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8,340mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్ల కలయికతో ప్యాక్ చేయబడి వస్తుంది. రియల్‌మి యొక్క ఈ కొత్త టాబ్లెట్ రియల్‌మి పెన్సిల్ మరియు రియల్‌మి స్మార్ట్ కీబోర్డ్‌ వంటి ఉపకరణాల మద్దతుతో కూడా వస్తుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ ధరల వివరాలు

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ ధరల వివరాలు

భారతదేశంలో రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ మూడు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో Wi-Fi కనెక్టివిటీతో లభించే 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ మోడల్‌ యొక్క ధర రూ.19,999 కాగా 5G కనెక్టివిటీ సామర్థ్యం గల ఇదే మోడల్ యొక్క ధర రూ.25,999. అలాగే 5G కనెక్టివిటీతో పాటు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ యొక్క ధర రూ.27,999. ఈ టాబ్లెట్ ఫ్లిప్‌కార్ట్, Realme.com మరియు ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా గ్లేసియర్ బ్లూ మరియు గ్లోయింగ్ గ్రే కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఆగస్టు 1న ప్రారంభంకానున్న మొదటి సేల్‌లో SBI మరియు HDFC బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై మూడు స్టోరేజ్ వేరియంట్‌లపై రూ.2,000 తగ్గింపును అందిస్తోంది.

రియల్‌మి పెన్సిల్, స్మార్ట్ కీబోర్డ్ ధరలు

రియల్‌మి పెన్సిల్, స్మార్ట్ కీబోర్డ్ ధరలు

ఇండియాలో రియల్‌మి పెన్సిల్ రూ.5,499 ధర వద్ద లాంచ్ కాగా రియల్‌మి స్మార్ట్ కీబోర్డ్ రూ.4,999 ధర వద్ద విడుదలైంది. రియల్‌మి బ్రాండ్ యొక్క ఈ రెండు ఉపకరణాలు భారతదేశంలో ఎప్పుడు విక్రయించబడతాయో కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇవే కాకుండా రియల్‌మి ఫ్లాట్ మానిటర్ ని కూడా రూ.12,999 ధర వద్ద లాంచ్ చేసింది. ఇది జూలై 29 యొక్క మొదటి సేల్‌లో Flipkart, Realme.com ద్వారా రూ.10,999 తగ్గింపు ధరతో బ్లాక్ కలర్ ఆప్షన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 12-ఆధారిత రియల్‌మి UI 3.0పై రన్ అవుతుంది. ఇది WUXGA+ (1,200x2,000 పిక్సెల్‌ల) రిజల్యూషన్‌తో 11-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా రన్ అవుతూ గరిష్టంగా 6GB RAMతో జత చేయబడి ఉంటుంది. అలాగే మెరుగైన పనితీరు కోసం ఈ టాబ్లెట్ 5GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను వర్చువల్ RAMగా ఉపయోగించడానికి అనుమతిస్తుంది.

ఫోటోగ్రఫీ

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ యొక్క ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాను అమర్చబడి వస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం టాబ్లెట్ ముందుభాగంలో 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 105-డిగ్రీల ఫీల్డ్ వ్యూతో వస్తుంది.

స్టోరేజ్

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్‌లో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్టుతో నాలుగు స్పీకర్లను అమర్చారు. Realme Pad X 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 8,340mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

మల్టీ టాస్కింగ్

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్‌ కూడా తక్కువ-లేటెన్సీ రియల్‌మి పెన్సిల్‌కు మద్దతును ఇస్తుంది. ఇది నోట్ లను గీయడానికి మరియు తీసుకోవడానికి ఉపయోగించబడుతుంది మరియు 10.6 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. టాబ్లెట్ రియల్‌మి స్మార్ట్ కీబోర్డ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది 1.3mm కీ ప్రయాణ దూరాన్ని కలిగి ఉంది మరియు మల్టీ టాస్కింగ్ కోసం వివిధ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు మరియు కాంబినేషన్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ డివైస్ లు విడిగా కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
Realme Pad X Tablet Launched in Inida With Snapdragon 695 SoC: Price, Specs, Sales Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X