రియల్‌మి నుంచి 64 ఎంపి కెమెరా స్మార్ట్‌ఫోన్, షియోమికి చెక్
గ్లోబల్ మొబైల్ మార్కెట్లో చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలు అయిన షియోమి, రియల్‌మి మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. షియోమి నుంచి కొత్త ఫోన్ రిలీజ్ కాగానే దానికన్నా మెరుగైన ఫీచర్లతో రియల్‌మి సరికొత్త ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే షియోమి దూకుడుకు రియల్‌మి చెక్ పెట్టేలా తన కొత్త ఫోన్ ని తీసుకురానుంది.

షియోమి ఇప్పటికే 64 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌పై పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రియల్ మి ఏకంగా 64 ఎంపి కెమెరా ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తున్నామని ప్రకటించింది. ఈ విషయాన్ని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ట్విట్టర్లో ఫోటో
రియల్‌మి 64 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌పై పనిచేస్తోంది. రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేత్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శామ్‌సంగ్ జీడబ్ల్యూ1 సెన్సార్‌తో అభివృద్ధి చేసిన ఈ కెమెరాతో తీసిన చిత్రాన్ని కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ ట్వీట్ చేశారు.

భారత్‌లోనే అందుబాటులోకి
రియల్‌మి కంపెనీ నుంచి వచ్చే ఏడాది 64 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను తొలిగా భారత్‌లోనే అందుబాటులోకి తీసుకువస్తామని మాధవ్ సేత్ తెలిపారు. ఫోటో మీద ఉన్న వాటర్‌మార్క్‌ను గమనిస్తే ఈ ఫోన్‌లో వెనుక భాగంలో నాలుగు కెమెరాలు ఉండే అవకాశముంది.

తొలిసారిగా 64 మెగా పిక్సెల్ కెమెరా
ప్రపంచంలో తొలిసారిగా 64 మెగా పిక్సెల్ కెమెరాను పొందుపరిచిన స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం గమనార్హం. శామ్‌సంగ్ టెట్రాసెల్ టెక్నాలజీతో తయారైన ఈ కెమెరాతో తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన చిత్రాలను తీయవచ్చు. కాగా, రియల్‌మీ జనవరి- మార్చి కాలంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 7.25 శాతం వాటా దక్కించుకుంది. డిసెంబర్ నాటికి 12-15 శాతం వాటాను లక్ష్యంగా చేసుకుంది.

తొలి 5 జీ స్మార్ట్‌ఫోన్
ఇదిలా ఉంటే రియల్‌మి ఇండియా తన తొలి 5 జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. 5జీ ప్రొడక్టులను ఈ ఏడాదిలోనే ఆవిష్కరించబోతున్నామని రియల్మి ఇండియా సీఎండీ మాధవ్ సేథ్ ప్రకటించారు. స్కైలితో సమావేశం అనంతరం సేథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. సాధ్యమైనంత త్వరలో భారతదేశానికి అత్యుత‍్తమ సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందించబోతున్నామన్నారు.

5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన నెలరోజుల్లోనే..
చైనా, ఇండియాలోలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన నెలరోజుల్లోనే తమ ఉత్పత్తులను ప్రవేశపెడతామని తెలిపింది. రియల్‌మి లేటెస్ట్‌గా రియల్‌మి ఎక్స్ పేరుతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసందే. 8జీబీ, 48ఎంపీ కెమెరా లాంటి ఫీచర్లతో చైనాలో లాంచ్ చేసింది. ఈ ఏడాది అర్థభాగానికి ఈ స్మార్ట్‌ఫోన ఇండియన్ మార్కెట్లను పలకరించనుంది. దీని ధర సుమారు. రూ. 15400గా ఉండనుందని సమాచారం.


Click it and Unblock the Notifications