Home
News

Realme Smart TV Sale: ఆఫ్‌లైన్ స్టోర్లలో మొదటిసారి అమ్మకానికి

చైనా యొక్క ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇండియాలో ‌స్మార్ట్‌ఫోన్లతో పాటుగా స్మార్ట్‌టీవీలను కూడా విడుదల చేసింది. ఈ సంస్థ గత నెలలో రియల్‌మి స్మార్ట్ టీవీని 32-అంగుళాల మరియు 43-అంగుళాల వేరియంట్‌లలో విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా పరిమిత సమయంలో అమ్మకానికి ఉండే ఈ టీవీలు ఇప్పుడు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కూడా వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చింది.

రియల్‌మి స్మార్ట్‌టీవీ ఆఫ్‌లైన్ అమ్మకాలు

రియల్‌మి స్మార్ట్‌టీవీ ఆఫ్‌లైన్ అమ్మకాలు

రియల్‌మి బ్రాండ్ యొక్క కొత్త కదలిక విషయంలో తన స్మార్ట్ టీవీని ప్రముఖ ఆన్‌లైన్ ఛానెల్స్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి‌.కామ్ ద్వారా ప్రత్యేకంగా విక్రయించిన కొన్ని నెలల తర్వాత మొదటిసారి భారతదేశం అంతటా 1,250 ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి వస్తుంది. రియల్‌మి బ్రాండ్ స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో రన్ అవుతూ నాలుగు-స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది HDR10 మద్దతుతో వస్తుంది మరియు డాల్బీ ఆడియోను కలిగి ఉంటుంది. రియల్‌మి స్మార్ట్ టీవీ అనేది ఇండియా యొక్క మార్కెట్ లో టిసిఎల్,VU, మరియు షియోమి వంటి సంస్థలతో  పోటీపడుతున్నది.

ఇండియాలో రియల్‌మి స్మార్ట్ టీవీ ధరల వివరాలు

ఇండియాలో రియల్‌మి స్మార్ట్ టీవీ ధరల వివరాలు

భారతదేశంలో రియల్‌మి బ్రాండ్ స్మార్ట్ టీవీల యొక్క ధరల విషయానికి వస్తే ఇందులో 32 అంగుళాల వేరియంట్‌ యొక్క ధర రూ.12,999 కాగా, 43 అంగుళాల మోడల్ యొక్క ధర రూ. 21,999. ఈ రెండు వేరియంట్లు మే నెలలో లాంచ్ అయ్యాయి. ఇవి ఇప్పటి వరకు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌.కామ్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఆఫ్‌లైన్ పద్ధతి ద్వారా కూడా స్మార్ట్ టీవీలను అమ్మకానికి అందుబాటులోకి తీసుకువచ్చింది.

రియల్‌మి టీవీ డిస్ప్లే మోడ్ ఫీచర్స్  

రియల్‌మి టీవీ డిస్ప్లే మోడ్ ఫీచర్స్  

రియల్‌మి టీవీలో క్రోమా బూస్ట్ టెక్నాలజీ గల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 400 నిట్స్ డిస్ప్లే గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్ ను ఉపయోగించినందున దీని యొక్క డిస్‌ప్లేలో ప్రకాశం, రంగు, స్పష్టత, కాంట్రాస్ట్ మరియు గ్రాఫిక్ స్వచ్ఛతతో మీకు ఇష్టమైన సినిమాలను సుప్రీం స్పష్టతతో చూడవచ్చు. రియల్‌మి టీవీల్లో స్టాండర్డ్, Vivid, గేమ్, స్పోర్ట్, మూవీ, యూజర్, ఎనర్జీ సేవింగ్ తో సహా ఏడు రకాల డిస్ప్లే మోడ్‌లు కూడా ఉన్నాయి. రియల్‌మి టీవీలు 178 డిగ్రీల "సూపర్ వైడ్ వ్యూయింగ్ యాంగిల్" ఫీచర్ ను కలిగివున్నాయి. అలాగే ఇది మీడియాటెక్ చిప్‌సెట్ ద్వారా 64 బిట్ క్వాడ్ కోర్ CPU మరియు మాలి -470 MP3 GPUలతో పనిచేస్తాయి. అలాగే ఇది 8GB ROM మరియు 1GB ర్యామ్ తో కూడా జతచేయబడి ఉన్నాయి.

రియల్‌మి టీవీ చిప్‌సెట్ డిజైన్

రియల్‌మి టీవీ చిప్‌సెట్ డిజైన్

రియల్‌మి టీవీలలో రూ .50 వేలకు పైగా ధర గల టీవీలలో గల డిజైన్ "శక్తివంతమైన చిప్‌సెట్"లను కలిగి ఉండి ఇవి HDR10 మరియు HLG వీడియోలకు మద్దతును అందిస్తుంది. రియల్‌మి టీవీలు డాల్బీ ఆడియో మద్దతుతో 24W క్వాడ్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండడంతో పాటుగా రెండు ట్వీటర్లను ప్రతి వైపు ఒకరు "పూర్తి ఆడియో అనుభవాన్ని వినియోగించడానికి వీలుగా ఉన్నాయి.

రియల్‌మి టీవీ వీడియో యాప్ల మద్దతు

రియల్‌మి టీవీ వీడియో యాప్ల మద్దతు

రియల్‌మి స్మార్ట్ టీవీలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్‌ వంటి ప్రముఖ వీడియో యాప్ ల మద్దతుతో పాటుగా ఇవి ఆండ్రాయిడ్ మద్దతుతో రన్ అవుతాయి. ఇంకా గూగుల్ ప్లే స్టోర్ నుండి 5000 కి పైగా అనువర్తనాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా  వినియోగదారులను అనుమతిస్తుంది. గూగుల్ అసిస్టెంట్ మద్దతుతో ప్రారంభించబడినందున ఇది వినియోగదారులను వారి వాయిస్ ఉపయోగించి కంటెంట్‌ను కనుగొనటానికి మరియు శోధించడానికి అనుమతిస్తుంది. అదనంగా Chromecast కూడా అంతర్నిర్మితంగా ఉంది మరియు ఇది వినియోగదారులు తమ పరికరాల్లోని కంటెంట్‌ను స్మార్ట్ టీవీకి ప్రతిబింబించేలా చేస్తుంది.

రియల్‌మి టీవీ బ్లూటూత్ కనెక్టివిటీ

రియల్‌మి టీవీ బ్లూటూత్ కనెక్టివిటీ

కనెక్టివిటీ ఎంపికల విషయానికొస్తే రియల్‌మి టీవీ బ్లూటూత్ 5.0 మరియు 2.4 GHz వైఫైకి మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. అలాగే ఇందులో మూడు హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి, ఒక AV మరియు ఒక డిజిటల్ ఆడియో అవుట్ పోర్ట్‌తో పాటు లాన్ పోర్టు కూడా ఉన్నాయి. ఆల్ ఇన్ వన్ స్మార్ట్ రిమోట్‌లో గూగుల్ అసిస్టెంట్‌కు శీఘ్ర యాక్సిస్ తో పాటు నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలకు ప్రత్యక్ష యాక్సిస్ కూడా ఉంది.

Best Mobiles in India

English summary
Realme Smart TV 32 and 43 inch Sale Start in India via Offline Stores
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X