వావ్..రియల్‌మి నుంచి అదిరే కొత్త ఫీచర్లతో స్మార్ట్‌టీవీ..

By Gizbot Bureau
|

ఇండియన్ టీవీ మార్కెట్లో దూసుకుపోతున్న షియోమి కంపెనీకి ఝలక్ ఇచ్చేందుకు రియల్ మి రెడీ అయింది. చైనా దిగ్గజం షియోమి ఇండియా మార్కెట్లో స్మార్ట్ టీవీల రంగంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దీనికి పోటీగా రియల్ మి కూడా ఇండియా మార్కెట్లో తన తొలి స్మార్ట్ టీవీని లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇండియా మార్కెట్లోకి డిసెంబర్ నెలలో రియల్ మి నుంచి స్మార్ట్ టీవీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019 చివరి అంకంలో Realme X2 Pro పేరుతో స్మార్ట్ టీవీని లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. కాగా ఇది ఇండియాలో తొలి కంపెనీ నుంచి తొలి స్మార్ట్ టీవీగా చెప్పవచ్చు. కంపెనీ నుంచి ఇంకా ఇతర టీవలు ఏమైనా వస్తాయా అనే దానిపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఇండియాలో లాంచ్ కాబోతున్న కొత్త స్మార్ట్ టీవీ ధర కొంచెం అందుబాటులోనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వావ్..రియల్‌మి నుంచి అదిరే కొత్త ఫీచర్లతో స్మార్ట్‌టీవీ..

 

రియల్‌మి గతేడాది ఇండియా మార్కెట్లోకి యాక్ససరీస్ తో ప్రవేశించింన సంగతి విదితమే. ఫోన్లకు సంంధించిన హార్డ్ వేర్ , సాప్ట్ వేర్ వంటి వాటిని బడ్జెట్ ధరలకే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈనేపథ్యంలో కంపెనీ రానున్న స్మార్ట్ టీవీలను కూడా అందుబాటు ధరల్లోనే మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఇండియా ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల వ్యాపారానికి హబ్ గా మారింది. ప్రతి కొత్త కంపెనీ ఇండయన్ స్మార్ట్ టీవీ మార్కెట్ వైపు చూస్తోంది. అదీగాకుండా స్మార్ట్ ఈకో సిస్టం ను ప్రజలు బాగా ఇష్టపడుతుండటంతో కంపెనీలు ఆ దిశలో తమ కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. షియోమి ఇప్పటికే ఇండియా మార్కెట్లో బాగా పాతుకుపోయింది.రానున్న రియల్ మి స్మార్ట్ టీవీకి సంబంధించి అధికారికంగా ఇంకా ఎటువంటి ఫీచర్లు విడుదల కాలేదు. అయితే 5జీ దూసుకొస్తున్న నేపథ్యంలో కంపెనీ దాని మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లుగా రానున్న స్మార్ట్ టీవీని ఇండియా మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

షియోమి టీవి మార్కెట్,

ఇండియాలో షియోమి మోడల్స్ 32 ఇంచ్ నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇవి దాదాపు 65 ఇంచ్ దాకా ఉన్నాయి. ఇండియా మార్కెట్లో ఇప్పుడు షియోమిదే రాజ్యమని చెప్పవచ్చు. స్మార్ట్ టీవీ మార్కెట్లో ఇప్పటివరకు కంపెనీ 2.5 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిపామని తెలిపింది. ఫెస్టివ్ సీజన్లోనే అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. దీంతో ఇతర కంపెనీలు కూడా షియోమి మార్కెట్ ని కొల్లగొట్టేందుకు పావులు కదుపుతున్నాయి. మోటోరోలా, ఎల్ జి, వన్ ప్లస్ లాంటి కంపెనీలు ప్రీమియం స్మార్ట్ టీవీ సెగ్మెంట్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme TV launching in India by year-end to take on Xiaomi’s Mi TV lineup

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X