ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 1000 తగ్గింది బాసూ
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ రియల్‌మి యు1పై తగ్గింపును అందించింది. ఒప్పో సబ్ బ్రాండ్ అయిన రియల్‌మి ఇండియా మార్కెట్లో సత్తా చాటుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కస్టమర్ల
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ రియల్‌మి యు1పై తగ్గింపును అందించింది. ఒప్పో సబ్ బ్రాండ్ అయిన రియల్‌మి ఇండియా మార్కెట్లో సత్తా చాటుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఈ మధ్య విడుదల చేసిన రియల్‌మి యు1పై వేయి రూపాయల తగ్గింపును అందిస్తోంది.

3GB RAM + 32GB storage and 4GB RAM + 64GB storage వేరియంట్లపై ఈ తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. తగ్గింపు ధరలను ఓ సారి పరిశీలిస్తే..

ధర
3GB RAM and 32GB ఇంటర్నల్ మెమొరీ ఉన్న ఫోన్ ధర రూ. 9,999కే అందుబాటులో ఉంది.ఈ ఫోన్ అసలు ధర రూ. 10,999, ఆఫర్లో భాగంగా వేయి రూపాయలు తగ్గింపును అందుకుంది. అలాగే 4GB RAM and 64GB internal storage ఫోన్ ధర కూడా రూ.1000 తగ్గింది. దీనిని రూ,11999కే సొంతం చేసుకోవచ్చు.

నవంబర్ నుంచి తగ్గుదల
కాగా ఈ ఫోన్ గతేడాది నవంబర్ లో విడుదలయింది. అప్పటి నుంచి ప్రతి సీజన్ లో వేయి రూపాయలు తగ్గుతూ వస్తోంది.లాంచింగ్ సమయంలో దీని ధర రూ.11,999గానూ 4జిబి వేరియంట్ ధర రూ.14,999గానూ ఉంది. Fiery Gold, Ambitious Black, and Brave Blue colour రంగుల్లో ఇది లభ్యమవుతోంది.

రియల్ మి యు1 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2350 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, డెడికేటెడ్ మొమొరీ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

6.3 ఇంచుల భారీ డిస్‌ప్లే
ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.లాంచింగ్ సమయంలో ఈ ఫోన్‌తోపాటు రూ.499 చెల్లిస్తే ఆకట్టుకునే డిజైనర్ కేస్‌లను అందిచారు. ఈ ఫోన్‌పై ఎస్‌బీఐ కార్డ్స్‌తో 5 శాతం క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది. జియో తన యూజర్లకు ఈ ఫోన్ ద్వారా 4.2 టీబీ అదనపు డేటాను ఉచితంగా అందిస్తున్నది.


Click it and Unblock the Notifications








