4 నిమిషాల 30 సెకన్లలో 0-100 శాతం ఛార్జింగ్.. ఈ 4 మినిట్స్ మిరాకల్ ఎలా పనిచేస్తుంది..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి తాజాగా సరికొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీ ద్వారా 5 నిమిషాల కంటే తక్కువ సమయంలో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని రియల్‌మి వెల్లడంచింది. చైనాలో నిర్వహించిన 828 Fan Fest లో 320W సూపర్‌సోనిక్ ఛార్జ్ టెక్నాలజీని (Realme 320w Super Sonic Charging Technology) ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో ఫోల్డబుల్ బ్యాటరీ మరియు రియల్‌మి 13 సిరీస్ విడుదలను ధ్రువీకరించింది.
ఈ కార్యక్రమంలో రియల్‌మి వైస్ ప్రెసిడెంట్ Chase Xu ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కీలక వివరాలు వెల్లడించారు. 0-100 శాతం ఛార్జింగ్‌ను కేవలం 4 నిమిషాల 30 సెకన్లలోనే పూర్తిచేయవచ్చని చెప్పారు. తొలి నిమిషంలో 26 శాతం, తొలి రెండు నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుందని తెలిపారు.

'4 మినిట్స్ మిరాకల్' టెక్నాలజీ అంటూ రియల్‌మి ప్రచారం చేస్తోంది. ఈ ఛార్జింగ్ సురక్షితమైనదని చెబుతోంది. UFCS (320W), PD, సూపర్‌వూక్ వంటి ఛార్జింగ్ ప్రోటోకాల్‌కు మద్దతిస్తుందని తెలిపింది. డ్యూయల్ USB- C ఛార్జింగ్ పోర్టును సపోర్టు చేస్తుందని రియల్‌మి తెలిపింది. ఒకేసారి గరిష్ఠంగా 150W ఛార్జింగ్ (స్మార్ట్‌ఫోన్), 65W వరకు ల్యాప్‌టాప్ ను సపోర్టు చేస్తుందని పేర్కొంది.
ఈ ఈవెంట్‌లో స్మార్ట్‌ఫోన్ ల కోసం Folded బ్యాటరీని పరిచయం చేసింది. ఈ బ్యాటరీ సామర్థ్యం 4420mAh గా ఉంటుంది. ఇందులో నాలుగు సెల్‌లు ఉంటాయని రియల్‌మి తెలిపింది. ప్రతి సెల్ 3mm మందం (Thickness) కలిగి ఉంటుంది. ఇతర సంప్రదాయ బ్యాటరీలతో పోలిస్తే.. ఈ కొత్త బ్యాటరీ 10 శాతం అదనంగా ఛార్జింగ్‌ను అందిస్తుంది.
ఇదే ఈవెంట్‌లో స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం AirGap వోల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా ఆవిష్కరించింది. విద్యుత్ సరఫరాలో ఎటువంటి హెచ్చు తగ్గులున్నా లేదా ఇతర కారణాలతో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ డ్యామేజీ కాకుండా చూస్తుంది. కాంటాక్ట్ ఫ్రీ విద్యుతయస్కాంత శక్తితో పనిచేస్తుంది. ఫలితంగా 20V వద్ద వోల్టేజీని నియంత్రిస్తుంది. 320W సూపర్ సోనిక్ ఛార్జ్ టెక్నాలజీ 98 శాతం థర్మల్ ఎఫీషియన్సీని సాధించిందని పేర్కొంది.
అయితే ఈ టెక్నాలజీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది. ఏ ఫోన్ లు సపోర్టు చేస్తాయి అనే సమాచారం వెల్లడి కాలేదు. భారత్‌లో ఈ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ (Realme super fast charging technology) ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందని అనే వివరాలు తెలియలేదు. వీటితోపాటు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








