Realme Watch 2 Pro ధరలు, 90 రకాల స్పోర్ట్స్ మోడ్ ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి!!

|

ప్రముఖ చైనా సంస్థ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ లతో విజయం సాధించడంతో తరువాత టీవీలను మరియు స్మార్ట్‌వాచ్ లను మరియు వాటి సంబంధిత గాడ్జెట్లను కూడా విడుదల చేస్తున్నది. ఇప్పటికే రియల్‌మి వాచ్ లను విడుదల చేసింది. వీటి అప్‌గ్రేడ్‌లో భాగంగా ఇప్పుడు కొత్తగా రియల్‌మి వాచ్ 2 ప్రోను మలేషియాలో విడుదల చేసింది. పాత మోడల్‌లతో పోల్చితే రియల్‌మి ఆధునిక స్క్వేర్ డయల్ డిజైన్ కోసం అతిపెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌పుట్‌తో 1.7-అంగుళాల డిస్ప్లేని పొందుతారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి వాచ్ 2 ప్రో ధరల వివరాలు

రియల్‌మి వాచ్ 2 ప్రో ధరల వివరాలు

రియల్‌మి అవుట్‌గోయింగ్ మోడల్‌ అప్‌గ్రేడ్‌లలో భాగంగా మలేషియాలో విడుదలైన రియల్‌మి వాచ్ 2 ప్రో యొక్క ధర 299 మలేషియా రింగ్‌గిట్ ను కలిగి ఉంది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.5,200. ఇది స్పేస్ గ్రే మరియు మెటాలిక్ సిల్వర్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఈ వాచ్ అనేక మార్కెట్లలో ఇప్పటికే ప్రారంభించిన పాత రియల్‌మి వాచ్ S వలె ఉంటుందని భావిస్తున్నారు. ఈ వాచ్‌లోని వివిధ రకాల రంగులను కూడా ఎంచుకోవచ్చు. అయితే రియల్‌మి దీనిని ఇతర మార్కెట్లలో ప్రారంభించటానికి ఎటువంటి ప్రణాళికలను ఇంకా ప్రకటించలేదు. కాని ఈ ఏడాది చివర్లో కంపెనీ దీనిని భారతదేశంలో ప్రారంభించాలని చూస్తున్నది.

రియల్‌మి వాచ్ 2 ప్రో స్పెసిఫికేషన్స్
 

రియల్‌మి వాచ్ 2 ప్రో స్పెసిఫికేషన్స్

రియల్‌మి వాచ్ 2 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 320 x 285 పిక్సెల్‌లతో 1.7-అంగుళాల పెద్ద LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో రియల్‌మి గరిష్టంగా 600 నిట్‌ల ప్రకాశాన్ని అందిస్తుందని సంస్థ తెలిపింది. ఈ వాచ్ IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉండడమే కాకుండా సింగిల్ పవర్ కీని కలిగి ఉంటుంది. అది మెనూ కీగా కూడా పనిచేస్తుంది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ 390mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి ఒక ఛార్జ్ మీద14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను అందించగలదని రియల్‌మి తెలిపింది.

రియల్‌మి వాచ్ 2 ప్రో ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్స్

రియల్‌మి వాచ్ 2 ప్రో ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్స్

ఫిట్నెస్ ట్రాకింగ్ విభాగంలో వాచ్ కొన్ని అప్డేట్ లను పొందుతుంది. ఇది 90 స్పోర్ట్స్ మోడ్ ట్రాకింగ్లను కలిగి ఉన్నాయి. కాని భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ అప్ డేట్ తో మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. వాచ్ 2 ప్రో సాధారణ దశ మరియు క్యాలరీ ట్రాకర్లతో పాటు ఆప్టికల్ హృదయ స్పందన సెన్సార్ మరియు రక్తంలో ఆక్సిజన్ పర్యవేక్షణ పనితీరును కూడా పొందుతుంది. ఈ వాచ్ మరింత ఖచ్చితమైన డేటా లాగ్‌లతో డ్యూయల్-జిపిఎస్ లొకేషన్ ట్రాకింగ్ సహాయం పొందుతుంది. ఈ రోజుల్లో జిపిఎస్ కనెక్టివిటీని అందించే వివిధ రకాల వాచ్ ల కంటే మెరుగ్గా ఇది వస్తుంది. అవుట్గోయింగ్ మోడల్ మాదిరిగానే రియల్‌మి వాచ్ 2 ప్రో వినియోగదారులను సెట్టింగులను మార్చడానికి మరియు అన్ని ఆరోగ్య డేటాను పర్యవేక్షించడానికి రియల్‌మి లింక్ యాప్ పై ఆధారపడుతుంది.

Best Mobiles in India

English summary
Realme Watch 2 Pro Smartwatch Released With 90 Sports Mode Tracking Features: India Price, Specifications, India Launch Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X