Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.

By Maheswara
|

ఇప్పటికే,1.8-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో Realme Watch 3 ఇటీవల భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఇప్పుడు, చైనీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ రియల్‌మే వాచ్ 3 ప్రో మోనికర్‌తో దేశంలో మరొక కొత్త స్మార్ట్ వాచ్ ని లాంచ్ చేయడానికి చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ తన ఈ కొత్త స్మార్ట్ వాచ్ యొక్క ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ, ఇది తన వెబ్‌సైట్‌లో అంకితమైన ల్యాండింగ్ పేజీ ద్వారా రియల్‌మే వాచ్ 3 ప్రో రాకను టీజర్ ద్వారా పంచుకుంది. రాబోయే ఈ మోడల్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు గత ఏడాది జూలైలో భారతదేశంలో ప్రవేశించిన రియల్‌మే వాచ్ 2 ప్రోకి నెక్స్ట్ జనరేషన్ గా ఇది రాబోతోంది.

Realme Watch 3 Pro

Realme Watch 3 Pro

ప్రత్యేకమైన మైక్రోసైట్ ద్వారా, Realme ఇండియా లాంచ్ మరియు Realme Watch 3 Pro యొక్క ముఖ్య స్పెసిఫికేషన్‌లను టీజర్ ద్వారా తెలియచేసింది. అయితే, ఈ జాబితా రాబోయే స్మార్ట్‌వాచ్ యొక్క ఖచ్చితమైన ప్రారంభ తేదీని పేర్కొనలేదు. ఈ స్మార్ట్ వాచ్ ఆగస్ట్ 18న Realme 9i 5Gతో పాటు లాంచ్ అవుతుందని అంచనాలున్నాయి.

Realme Watch 3 Pro features

Realme Watch 3 Pro features

Realme Watch 3 Pro నావిగేషన్ కోసం సైడ్-మౌంటెడ్ బటన్‌తో దీర్ఘచతురస్రాకార బ్లాక్ డయల్‌తో చూపబడింది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ మద్దతును కూడా అందిస్తుంది. ఇది వినియోగదారులు వారి మణికట్టు నుండి నేరుగా కాల్‌లను స్వీకరించడానికి మరియు చేయడానికి అనుమతిస్తుంది. ఇది దేశంలో ఇటీవల ప్రారంభించబడిన రియల్‌మే వాచ్ 3 కంటే కొంచెం అధిక ధర కలిగి ఉంటుంది.

ధరను అంచనా వేయవచ్చు

ధరను అంచనా వేయవచ్చు

రాబోయే రియల్‌మే వాచ్ 3 ప్రో గత ఏడాది జూలైలో దేశంలో ప్రారంభించిన రియల్‌మే వాచ్ 2 ప్రో స్మార్ట్‌వాచ్‌పై అప్‌గ్రేడ్‌లతో వచ్చే అవకాశం ఉంది, దీని ధర రూ. 4,999. దీనిని బట్టి ఈ కొత్త స్మార్ట్ watch యొక్క ధరను అంచనా వేయవచ్చు, అయినప్పటికీ కంపెనీ దాని ధరకు సంబంధించి ఇంకా ప్రకటన చేయలేదు.

Realme Watch 2 Pro

Realme Watch 2 Pro

Realme Watch 2 Pro యొక్క వివరాలు గమనిస్తే , ఇది 1.75-అంగుళాల (320x385 పిక్సెల్‌లు) కలర్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది మరియు దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది హృదయ స్పందన రేటు మరియు SpO2 పర్యవేక్షణ రెండింటికి మద్దతు ఇస్తుంది మరియు అనుకూలీకరణ కోసం 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను అందిస్తుంది. Realme Watch 2 Pro Realme Link యాప్‌ని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అవుతుంది. ఇంకా , Android మరియు iOS రెండింటితో పని చేస్తుంది. ఇది 390mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కంపెనీ ప్రకారం ఈ స్మార్ట్ వాచ్ బ్లూ టూత్ v5 కనెక్టివిటీని అందిస్తుంది.

Realme Pad X టాబ్లెట్‌

Realme Pad X టాబ్లెట్‌

ఇటీవలే Realme నుంచి Realme Pad X టాబ్లెట్‌ కూడా లాంచ్ అయినా సంగతి మీకు తెలిసిందే.ఇప్పుడు ,Realme Pad X టాబ్లెట్‌ యొక్క స్పెసిఫికేషన్లు మరియు ధరల వివరాలు తెలుసుకుందాం.రియల్‌మి కంపెనీ యొక్క ఈ తాజా టాబ్లెట్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా శక్తిని పొందుతూ 5G కనెక్టివిటీని అందించే రియల్‌మి బ్రాండ్ యొక్క మొదటి టాబ్లెట్. 11-అంగుళాల WUXGA+ రిజల్యూషన్ డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్ సెటప్‌, 13-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 105-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8,340mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్ల కలయికతో ప్యాక్ చేయబడి వస్తుంది. రియల్‌మి యొక్క ఈ కొత్త టాబ్లెట్ రియల్‌మి పెన్సిల్ మరియు రియల్‌మి స్మార్ట్ కీబోర్డ్‌ వంటి ఉపకరణాల మద్దతుతో కూడా వస్తుంది.

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ ధరల వివరాలు

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ ధరల వివరాలు

భారతదేశంలో రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ మూడు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో Wi-Fi కనెక్టివిటీతో లభించే 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ మోడల్‌ యొక్క ధర రూ.19,999 కాగా 5G కనెక్టివిటీ సామర్థ్యం గల ఇదే మోడల్ యొక్క ధర రూ.25,999. అలాగే 5G కనెక్టివిటీతో పాటు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ యొక్క ధర రూ.27,999. ఈ టాబ్లెట్ ఫ్లిప్‌కార్ట్, Realme.com మరియు ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా గ్లేసియర్ బ్లూ మరియు గ్లోయింగ్ గ్రే కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఆగస్టు 1న ప్రారంభంకానున్న మొదటి సేల్‌లో SBI మరియు HDFC బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై మూడు స్టోరేజ్ వేరియంట్‌లపై రూ.2,000 తగ్గింపును అందిస్తోంది.

రియల్‌మి పెన్సిల్, స్మార్ట్ కీబోర్డ్ ధరలు

రియల్‌మి పెన్సిల్, స్మార్ట్ కీబోర్డ్ ధరలు

ఇండియాలో రియల్‌మి పెన్సిల్ రూ.5,499 ధర వద్ద లాంచ్ కాగా రియల్‌మి స్మార్ట్ కీబోర్డ్ రూ.4,999 ధర వద్ద విడుదలైంది. రియల్‌మి బ్రాండ్ యొక్క ఈ రెండు ఉపకరణాలు భారతదేశంలో ఎప్పుడు విక్రయించబడతాయో కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇవే కాకుండా రియల్‌మి ఫ్లాట్ మానిటర్ ని కూడా రూ.12,999 ధర వద్ద లాంచ్ చేసింది. ఇది జూలై 29 యొక్క మొదటి సేల్‌లో Flipkart, Realme.com ద్వారా రూ.10,999 తగ్గింపు ధరతో బ్లాక్ కలర్ ఆప్షన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

Read more about:
English summary
Realme Watch 3 Pro India Launch Confirmed. Teaser Shows AMOLED Display.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X