వచ్చే ఏడాది నుంచి రియల్‌మి 4G ఫోన్‌లు ఉండవు... ఎందుకో తెలుసా?

|

రియల్‌మి సంస్థ వచ్చే ఏడాది నుండి చైనాలో కేవలం 5G మొబైల్ ఫోన్‌లను మాత్రమే విడుదల చేయనున్నట్లు సంస్థ CEO మరియు వ్యవస్థాపకుడు స్కై లి తెలిపారు. రియల్‌మి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 4G ఫోన్‌లను అమ్మడం కొనసాగిస్తుంది.

 

రియల్‌మి 5G

గత నెలలో రియల్‌మి ఎక్స్‌2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌ రెండవ వారంలో రియల్‌మి XT 730G ని కూడా ఇండియాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. రియల్‌మి యొక్క 5G ఫోన్లు 2020 మొదటి త్రైమాసికంలో ఇండియాలో విడుదల చేయనున్నట్లు కూడా కంపెని ధృవీకరించింది.

 

విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టాడు... రాత్రికి రాత్రి వరల్డ్ ఫెమస్ అయ్యాడువిక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టాడు... రాత్రికి రాత్రి వరల్డ్ ఫెమస్ అయ్యాడు

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్

చైనాలో రియల్‌మి యొక్క ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మాత్రమే దృష్టి సారించనున్నట్లు సమాచారం. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు 5G ని వచ్చే ఏడాది మిడ్-రేంజ్ మరియు బడ్జెట్ ఫోన్‌లకు తీసుకురావడానికి చూస్తున్నారు. 5G ను మరింత ప్రాచుర్యం చేయడానికి మరియు వినియోగదారులకు సులభంగా అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రియల్‌మి తన X50, X50 యూత్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో 5G కనెక్టివిటీతో విడుదల చేయబోతున్నట్లు ఒక నివేదిక తెలిపింది.

 

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో చూడండిఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో చూడండి

5G ఫోన్‌లు
 

రాబోయే రియల్‌మి ఫోన్‌లు 5G స్టాండ్ అలోన్ (SA) మరియు నాన్-స్టాండలోన్ (NSA) నెట్‌వర్క్‌లకు మద్దతును అందిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే డ్యూయల్ మోడ్ 5G కనెక్టివిటీ సపోర్ట్ అన్న మాట. ఇటీవలే షియోమి CEO లీ జున్ 2019 వరల్డ్ 5G కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ 5G ఫ్యాక్టరీని నిర్మించే చివరి దశలో కంపెనీ ఉందని తెలిపారు. ఇప్పుడు సంస్థ 5G ఫ్లాగ్‌షిప్‌ల అభివృద్ధి మరియు ఉత్పత్తిని మరింత పెంచింది అని తెలిపారు. రియల్‌మి యొక్క ప్రత్యర్థి షియోమి త్వరలో తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లను కూడా విడుదల చేయబోతున్నది.

 

వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో చూడండివోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో చూడండి

రెడ్‌మి K30

షియోమి యొక్క ఉప-బ్రాండ్ రెడ్‌మి డిసెంబర్ 10 న చైనాలో జరిగే కార్యక్రమంలో తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుంది. ఈ సంస్థ రెడ్‌మి K30 ఫోన్‌ను విడుదల చేయనున్నది. ఇది SA మరియు NSA నెట్‌వర్క్ రకాల మద్దతుతో 5G కనెక్టివిటీని కలిగి ఉంటుంది. అంటే మార్కెట్‌లోకి 5G డ్యూయల్ మోడ్ కనెక్టివిటీతో లాంచ్ చేయబోతున్న షియోమి యొక్క 5G స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి K30.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme will stop Releasing 4G smartphones in 2020, More focus on 5G mobiles

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X