Home
News

Realme తదుపరి స్మార్ట్‌ఫోన్‌లో సరికొత్త టెక్నాలజీ ఉపయోగించనున్నది!!

ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ లో రియల్‌మి బ్రాండ్ అధిక ప్రాధాన్యతను కలిగి ఉంది. గత రెండు సంవత్సరాలలో ఇండియా మార్కెట్లో అధిక సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. ఈ బ్రాండ్ అన్ని రకాల ధరల విభాగాలలో తమ యొక్క స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. అయితే మొబైల్ హంట్ నివేదిక ప్రకారం Realme సంస్థ ప్రస్తుతం అండర్-డిస్ప్లే కెమెరా ఫీచర్ తో తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందివ్వాలనే లక్ష్యంతో పని చేస్తోంది. Samsung, ZTE వంటి మరిన్ని బ్రాండ్లు ఇప్పటికే అండర్ డిస్‌ప్లే కెమెరా ఫీచర్ తో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసాయి. ఈ ఫీచర్ ను ఉపయోగిస్తున్న కొద్దిమంది స్మార్ట్‌ఫోన్ తయారీదారుల సరసన రియల్‌మి బ్రాండ్ కూడా తన యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌తో చోటు దక్కించుకొనున్నది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి అండర్ డిస్‌ప్లే కెమెరా ఫీచర్

రియల్‌మి అండర్ డిస్‌ప్లే కెమెరా ఫీచర్

రియల్‌మి అండర్ డిస్‌ప్లే కెమెరా ఫీచర్ కు సంబందించి ఇటీవల వచ్చిన నివేదికలో పేటెంట్ ఫైలింగ్ నుండి తీసిన కొన్ని వైర్‌ఫ్రేమ్ రేఖాచిత్రాలు ఉన్నాయి. ఈ రేఖాచిత్రాలలో డివైస్ సెల్ఫీ కెమెరాను ఏకీకృతం చేయడానికి ఎటువంటి మచ్చలను కలిగి లేకపోవడం విశేషం. గుర్తుచేసుకుంటే కనుక సెప్టెంబర్‌లో Realme VP Xu Qi Chase నాచ్ లేదా పంచ్ హోల్ లేని స్మార్ట్‌ఫోన్ చిత్రాన్ని Weiboలో పోస్ట్ చేసారు. ఇది పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో తిరిగి వస్తుందనే ఊహాగానాలకు దారితీసింది. అయినప్పటికీ ఆ డివైస్ పాప్-అప్ మెకానిజంతో కూడా రాదని మరియు అండర్ డిస్‌ప్లే కెమెరా టెక్‌ని సూచిస్తూ పోస్ట్ వ్యాఖ్యలలో చేజ్ స్పష్టం చేశారు.

వైర్‌ఫ్రేమ్ రేఖాచిత్రాలు

వైర్‌ఫ్రేమ్ రేఖాచిత్రాలు LED ఫ్లాష్ మాడ్యూల్‌తో పాటు మూడు కెమెరా సెన్సార్‌లను కలిగి ఉన్న ఒక దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ను వెనుకవైపు ప్రదర్శిస్తున్నాయి. అలాగే కుడివైపు అంచున పవర్ బటన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఎడమవైపు అంచున సౌండ్ వాల్యూమ్ రాకర్‌లను కలిగి ఉంటుంది. అలాగే దిగువ అంచులో USB టైప్-C పోర్ట్ మరియు సిమ్ ట్రే కోసం కటౌట్‌లు ఉన్నాయి. చివరిగా 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కోసం కటౌట్‌ను కలిగి ఉన్నట్లు అయితే కనిపించడం లేదు.

డిజైన్

పేటెంట్ ఫైలింగ్ ప్రదర్శించిన డిజైన్ భౌతిక పరికరంగా కార్యరూపం దాల్చుతుందని హామీ ఇవ్వనప్పటికీ రియల్‌మి అదే దిశగా పని చేస్తుందని సూచిస్తుంది. రియల్‌మి కాకుండా అనేక ఇతర చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు హానర్, ఒప్పో మరియు వివో వంటి బ్రాండ్‌లతో సహా అండర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా టెక్నాలజీపై పనిచేస్తున్నట్లు సమాచారం.

రియల్‌మి

రియల్‌మి తదుపరి స్మార్ట్‌ఫోన్‌కు సంబందించిన ఇతర వార్తల విషయానికి వస్తే రియల్‌మి ప్రస్తుతం 'సరైన' ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో పని చేస్తున్నట్లు నివేదించబడింది. దీని యొక్క ధర సుమారు 5,000 యువాన్లు. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.58,000 గా ఉండే అవకాశం ఉంది. రియల్‌మి చైనా ప్రెసిడెంట్ జు క్వి చైనా మొబైల్ గ్లోబల్ పార్టనర్ కాన్ఫరెన్స్ 2021 (ITHome ద్వారా)లో స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని చెప్పారు. ప్రస్తుతానికి రాబోయే ఫ్లాగ్‌షిప్ పరికరం కంపెనీ యొక్క ప్రస్తుత GT సిరీస్ లేదా కొత్త సిరీస్‌లో ప్రారంభించబడుతుందా అనేది అస్పష్టంగా ఉంది.

Best Mobiles in India

English summary
Realme Will Use Under Display Camera Technology in It's Next Upcoming Smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X