రియల్‌మి వింటర్ సేల్స్ లో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు
చైనా యొక్క ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్‌మి ఇప్పుడు తన ఆన్‌లైన్ వెబ్ సైట్ లో రియల్‌మి వింటర్ సేల్ ను ప్రకటించింది. ప్రత్యేక సేల్స్ సందర్బంగా రియల్‌మి సంస్థ తమ సొంత స్మార్ట్ ఫోన్ల కొనుగోలు మీద గొప్ప ఆఫర్లను అందిస్తున్నది. గత నెల రెండవ వారంలో రిలీజ్ అయిన రియల్‌మి X2ప్రో మరియు రియల్‌మి 5S వంటి వాటి మీద కూడా గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నది.

రియల్‌మి వింటర్ సేల్ డిసెంబర్ 5 గురువారం వరకు జరగనున్నది. ఈ సేల్ సందర్బంగా రియల్‌మి 5 ప్రో, రియల్‌మి సి 2, రియల్‌మి ఎక్స్, రియల్‌మి 3 ప్రో మరియు రియల్‌మి 3 మరియు రియల్‌మి 3i లను కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు రూ.1,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇంకా మోబిక్విక్ ద్వారా 10 శాతం వరకు సుమారు రూ.1,000 సూపర్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. రియల్‌మి యొక్క ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొత్త హ్యాండ్‌సెట్ ను బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డు ద్వారా కొనుగోలు చేయడం కోసం వినియోగదారులకు నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికలను కంపెనీ అందిస్తుంది. అంతేకాకుండా అదనంగా క్యాషిఫై ద్వారా రూ.500 వరకు తగ్గింపును ఇస్తున్నది.

ఇండియాలో రియల్‌మి యొక్క ఆన్‌లైన్ స్టోర్ ద్వారా నిర్వహిస్తున్న రియల్‌మి వింటర్ సేల్ లో రియల్‌మి 5 ప్రోను ఇప్పుడు రూ. 12,999 ధర వద్ద పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ధర రూ.13,999 తో పోలిస్తే ఇది రూ.1,000ల తగ్గింపు ధర. అలాగే దీనిని మోబిక్విక్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.1,000 ల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

మిగిలిన రియల్‌మి స్మార్ట్‌ఫోన్ ల మీద కూడా డిస్కౌంట్ ను అందిస్తున్నది. వాటి వివరాలు కింద పట్టికలో ఉన్నాయి.
| స్మార్ట్‌ఫోన్ | ఒరిజినల్ ధర | డిస్కౌంట్ ధర |
| రియల్‌మి 5 ప్రో | 13,999 | 12,999 |
| రియల్‌మి సి 2 | 6,999 | 5,999 |
| రియల్‌మి X | 16,999 | 15,999 |
| రియల్‌మి 3ప్రో | 12,999 | 9,999 |
| రియల్‌మి 3 | 9,999 | 8,999 |

కూపన్లు
రియల్‌మి వింటర్ సేల్ లో రియల్‌మి 5 ప్రో కొనుగోలుపై రూ.1,000 ల విలువైన కూపన్లను ఉచితంగా పొందవచ్చు. అలాగే రియల్‌మి 3 లేదా రియల్‌మి 3i స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.500 విలువైన కూపన్లను అందిస్తుంది. ఈ కూపన్లను ఉపయోగించి రియల్‌మి యొక్క ఆన్‌లైన్ స్టోర్ నుండి ఏవైనా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








