ఇండియాలో ఆలస్యంగా రిలీజ్ అవుతున్న రియల్ మిX
రియల్ మిX త్వరలో ఇండియాలో ప్రారంభించాల్సి ఉంది. కాని కంపెనీ 2019 సంవత్సరం మొదటి సగంలో ప్రవేశపెట్టలేకపోతుందని తెలుస్తోంది.
రియల్ మిX త్వరలో ఇండియాలో ప్రారంభించాల్సి ఉంది. కాని కంపెనీ 2019 సంవత్సరం మొదటి సగంలో ప్రవేశపెట్టలేకపోతుందని తెలుస్తోంది. రియల్ మి ఇండియా సీఈఓ మాధవ్ షిత్ ఇండియాలో రియల్ మిX లాంచింగ్ ఆలస్యం అవుతోంది అంటే సంవత్సరం రెండవ భాగంలో కావచ్చు అని ట్వీట్ ద్వారా తెలిపారు. దీని అర్థం రియల్ మిX జులై నెల వరకు ఇండియాకు రాదు. CEO ఈ మొబైల్ యొక్క రిలీజ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.

చైనా మార్కెట్లో సంస్థ యొక్క ఎంట్రీని గుర్తించడానికి కొన్ని వారాల క్రితం రియల్ మిXను మొదటిసారిగా చైనాలో రిలీజ్ చేసారు.ఇండియాలో తాజాగా రియల్ మి సంస్థ మిడ్ రేంజ్ మొబైల్ రియల్ మి3 ప్రోని కొన్ని నెలల క్రితం రూ.13,999 ధర వద్ద మొదలుపెట్టింది. గతంలో CEO మాధవ్ షీత్ రూ.18,000 ధరకు ఇండియాలో రియల్ మిXను ప్రారంభించనున్నట్లు ధ్రువీకరించింది.

స్నాప్ డ్రాగన్730
చైనాలో రిలీజ్ అయిన రియల్ మిX మోడల్ తో పోలిస్తే ఇండియాలో రిలీజ్ అవ్వబోయే రియల్ మిX వేరియంట్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది అని కంపెనీ ఇప్పటికే ధ్రువీకరించింది. ఈ వ్యత్యాసం హార్డ్వేర్ లలో చాలా వరకు ఉంటుంది. కంపెనీ స్నాప్ డ్రాగన్730 డివైస్ తో ప్రారంభించనున్నట్లు పలు ఊహాగానాలు ఉన్నాయి. చైనాలో ప్రారంభించిన రియల్ మిX స్నాప్ డ్రాగన్710చిప్సెట్ సంస్కరణతో రిలీజ్ చేసింది.

రెడ్మీ K20
రియల్ మిX స్నాప్ డ్రాగన్730 చిప్సెట్ తో వచ్చినట్లయితే ఈ ఫోన్ రెడ్మీ K20 తో పోటీపడటానికి సహాయపడుతుంది.ఇది త్వరలోనే ఇండియాలో ప్రారంభించనుంది. Xiaomi స్పష్టంగా ఇంకా ధ్రువీకరించలేదు అయితే కంపెనీ గ్లోబల్ VP మను కుమార్ జైన్ ఇటీవల స్నాప్ డ్రాగన్730 చిప్స్ తో Redmi K20 ఫోన్ త్వరలో ఇండియాలో ప్రారంభిస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలిపారు.

Realme X స్పెసిఫికేషన్స్ :
గత వారంలో చైనాలో రిలీజ్ అయిన రియల్ మి X 6.5-inch గరిష్ట AMOLED డిస్ప్లే FHD + రిజల్యూషన్ తో మరియు డిస్ప్లే లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు ఈ డివైస్ స్నాప్ డ్రాగన్710 చిప్సెట్ తో 8GB RAMతో జత చేయబడి ఉంటుంది.ఈ డివైస్ Android 9 పై ColorOS 6 తో రన్ అవుతుంది.
Realme లో శక్తివంతమైన కెమెరాలు హైలైట్ గా ఉన్నాయి.బ్యాక్ కెమెరా అధిక రిజల్యూషన్ 48MP సోనీ IMX586 సెన్సార్ను అందిస్తుంది. రియల్మీ 3 ప్రో వలె రియల్మీ X కూడా నైట్ స్కేప్ మరియు క్రోమా బూస్ట్ తో వస్తుంది.ఫ్రంట్ సైడ్ పాప్-అప్ కెమెరా 16MP సెన్సార్ను కలిగి ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 4500mAh, VOOC 3.0 వేగవంతమైన ఛార్జింగ్ మద్దతుతో వస్తుంది.


Click it and Unblock the Notifications








