గొప్ప తగ్గింపు ధరలతో అమ్మకానికి రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు

|

ప్రస్తుతం ఇండియాలో రియల్‌మి సంస్థ తన వెబ్ సైట్ లో రియల్‌మి ఎక్స్‌ట్రా డేస్ సేల్స్ ను నిర్వహిస్తోంది. ఈ అమ్మకం సమయంలో పరిమిత కాలానికి రియల్‌మి యొక్క కొన్ని ఫోన్‌ల సిరీస్ ల యొక్క ధరల మీద తగ్గింపును అందిస్తోంది.

రియల్‌మి
 

రియల్‌మి యొక్క ఈ సేల్స్ ఫిబ్రవరి 29న ముగియనున్నాయి. రియల్‌మి సంస్థ ధరల తగ్గింపును అందిస్తున్న స్మార్ట్ ఫోన్ లలో రియల్‌మి X, రియల్‌మి XT మరియు రియల్‌మి 5 ప్రో వంటివి ఉన్నాయి. రియల్‌మిX మీద రూ.2,000 వరకు ధర తగ్గింపు ఉండగా, రియల్‌మి XT ఫోన్ యొక్క ధర మీద రూ.1,000 తగ్గింపును ప్రకటించింది.

New HD కనెక్షన్ సెట్-టాప్ బాక్స్‌లలో టాప్ ఎవరో తెలుసా...

సేల్స్ ఆఫర్స్

సేల్స్ ఆఫర్స్

రియల్‌మి.కామ్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న అమ్మకాలలో నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్స్, కాహ్సిఫై ఎక్స్ఛేంజ్లో అదనంగా రూ.500 వరకు తగ్గింపు, మరియు మొబిక్విక్ ద్వారా రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ ఇండియాలు తన పోర్టల్ లో బ్యాంక్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మరియు నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికలను అందిస్తున్నాయి.

Amazon Fab Phone Fest: మతిపోయే డిస్కౌంట్ ఆఫర్స్....

 రియల్‌మిX

రియల్‌మిX

రియల్‌మి ఇండియా యొక్క CEO మాధవ్‌ శేత్‌ తన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా సేల్స్ యొక్క ప్రకటనను మరియు ధరల తగ్గింపు వివరాలను ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న అమ్మకంలో రియల్‌మిX యొక్క 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను రూ.14,999 ధర వద్ద అలాగే 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.17,999 ధరల వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ అమ్మకపు కాలంలో రెండు కాన్ఫిగరేషన్ల మీద సుమారు రూ.2,000 వరకు తగ్గింపును ప్రవేశపెట్టబడింది. కొత్త ధరల వద్ద ఈ ఫోన్లను రియల్‌మి.కామ్, అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పోలార్ వైట్ మరియు స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

రియల్‌మి XT
 

రియల్‌మి XT

రియల్‌మి XT యొక్క అన్ని వేరియంట్‌ల మీద కూడా ధరల తగ్గింపును అందిస్తున్నది. రియల్‌మిXT యొక్క 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను రూ. 14,999, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ. 15,999 మరియు రూ. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌ కాన్ఫిగరేషన్ ను రూ.17,999 దరల వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే రియల్‌మి.కామ్, అమెజాన్ ఇండియా, మరియు ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి XT యొక్క అన్ని వేరియంట్‌ల మీద రూ.1,000 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ పెర్ల్ బ్లూ మరియు పెర్ల్ వైట్ కలర్ ఫినిష్‌లలో లభిస్తుంది.

Airtel అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ల జాబితాలో మూడు కొత్త ప్లాన్‌లు

రియల్‌మి 5 ప్రో

రియల్‌మి 5 ప్రో

ఎక్స్‌ట్రా డేస్ అమ్మకంలో భాగంగా కంపెనీ రియల్‌మి 5 ప్రోను కూడా రాయితీ ధరతో అందిస్తోంది. ఇందులో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ను ప్రస్తుతం రూ.11,999 ధరతో అందిస్తుంది. అంటే ఈ సేల్ ఆఫర్‌లో భాగంగా రూ.1,000 తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ మరియు 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది. ఈ మోడల్స్ యొక్క దరల మీద అదనపు తగ్గింపు లభించదు. ఈ వేరియంట్స్ యొక్క రిటైల్ ధరలు వరుసగా రూ.13,999 మరియు రూ.15,999 గా ఉన్నాయి. ఈ ఫోన్ బ్లూ మరియు క్రిస్టల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

రియల్‌మి 6,6ప్రో ఇండియా లాంచ్

రియల్‌మి 6,6ప్రో ఇండియా లాంచ్

ఇండియాలో రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో ఈవెంట్ లాంచ్ కార్యక్రమం మార్చి 5 న మధ్యాహ్నం 12:30 PM IST సమయం వద్ద ప్రారంభమవుతున్నట్లు సంస్థ యొక్క MD మాధవ్ సేథ్ ట్వీటర్ ద్వారా పోస్ట్ చేసాడు. ప్రస్తుతం కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. సల్మాన్ ఖాన్ చేతిలో గల రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల వీడియోను చిత్రీకరించి టీజర్ రూపంలో విడుదల చేసారు.

రియల్‌మి 6,6ప్రో ఇండియా ధరల వివరాలు

రియల్‌మి 6,6ప్రో ఇండియా ధరల వివరాలు

రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు పంచ్ హోల్ డిస్ప్లేను కలిగి ఉండి రూ.15000 ధరల పాయింట్‌ను కలిగి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల యొక్క వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ సెన్సర్ తో రావడం అతి పెద్ద విశేషం. రియల్‌మి సంస్థ మిడ్-రేంజ్ విభాగంలోని స్మార్ట్‌ఫోన్లలో 64 మెగాపిక్సెల్ కెమెరాను అందించే వాటిలో ఇదే మొదటిది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme X, Realme XT, Realme 5 Pro Price Slashed: Here are The Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X