ఫ్లిప్‌కార్ట్ లో రియల్‌మి X2 ప్రో సేల్స్ .. క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ అదుర్స్

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి సంస్థ ఇటీవల ఇండియాలో తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు రియల్‌మి యొక్క స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఎక్స్ 2 ప్రో మొదటిసారిగా అమ్మకాలు మొదలైనాయి. ఇది 90HZ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండి క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్ తో రన్ అవుతుంది.

 

స్మార్ట్‌ఫోన్‌

64 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి వున్న ఈ హ్యాండ్‌సెట్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 2020 మొదటి త్రైమాసికంలో ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను కూడా విడుదల చేయనున్నట్లు రియల్‌మి ధృవీకరించింది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మెరుగైన సౌండ్ తో గూగుల్ నెస్ట్ మినీ స్పీకర్... ధర కాస్త ఎక్కువమెరుగైన సౌండ్ తో గూగుల్ నెస్ట్ మినీ స్పీకర్... ధర కాస్త ఎక్కువ

ధరల వివరాలు
 

ధరల వివరాలు

రియల్‌మి ఎక్స్ 2 ప్రో యొక్క మొదటి సేల్ ఈ రోజు 12:00 PM నుండి ప్రారంభమైంది. ఈ సేల్ కేవలం ఒకే రోజు అంటే నవంబర్ 27, 11:59 PM IST వరకు మాత్రమే కొనసాగుతుంది. ఈ అమ్మకంలో భాగంగా రియల్‌మి ఫోన్‌తో పాటుగా రియల్‌మి బడ్స్ లను కూడా ఉచితంగా అందిస్తోంది. రియల్‌మి ఎక్స్‌ 2 ప్రోను ఇండియాలో రెండు వేరియంట్ లలో రిలీజ్ చేస్తున్నారు ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.29,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.33,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనిని ఫ్లిప్‌కార్ట్ మరియు Realme.com నుండి కొనుగోలు చేయవచ్చు.

 

Black Friday Sale 2019: భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో షియోమి ప్రోడక్ట్స్Black Friday Sale 2019: భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో షియోమి ప్రోడక్ట్స్

ఆఫర్స్

ఆఫర్స్

రియల్‌మి ఎక్స్ 2 ప్రోను ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి యొక్క ప్రీమియం ఫోన్ లూనార్ వైట్ మరియు నెప్ట్యూన్ బ్లూ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డుల వినియోగదారులకు 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రియల్‌మి ఎక్స్‌ 2 ప్రో మాస్టర్‌ ఎడిషన్‌ను రెడ్‌ బ్రిక్‌ కలర్ ఎంపికలో రూ. 34,999 ధర వద్ద విడుదల చేసింది. కానీ ఇది క్రిస్మస్ సందర్భంగా సేల్స్ జరుగుతుంది. రియల్‌మి ఎక్స్‌ 2 ప్రోలో సేల్ ఆఫర్‌లలో భాగంగా 6 నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్లు మరియు రూ.11,500 విలువైన జియో ప్రయోజనాలను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ 3 మరియు 6 నెలల నో-కాస్ట్ EMI ప్రయోజనాలను అందిస్తుంది. వినియోగదారులకు 12 నెలల వరకు కార్డ్-లెస్ క్రెడిట్ సొల్యూషన్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.

 

ఒప్పో 10,000mAh పవర్ బ్యాంక్... ధర చాలా తక్కువ!!!ఒప్పో 10,000mAh పవర్ బ్యాంక్... ధర చాలా తక్కువ!!!

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రియల్‌మి ఎక్స్‌ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855+ ద్వారా రన్ అవుతుంది. ఆసుస్ ROG ఫోన్ 2, షియోమి బ్లాక్‌షార్క్ 2 ప్రో, వన్‌ప్లస్ 7 టి మరియు వన్‌ప్లస్ 7 టి ప్రో మాత్రమే ముందుగా ఈ చిప్‌సెట్‌ ద్వారా రన్ అవుతున్న డివైస్లు. ఈ డివైస్ యొక్క రూపకల్పన చైనాలో ప్రారంభించటానికి ముందే కంపెనీ ధృవీకరించింది. ఈ డిజైన్ రియల్‌మి ఎక్స్ 2 తో అధికారికంగా మార్కెట్ లోకి రానున్నది. రియల్‌మి X2 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 2400 x 1080 పిక్సెల్‌ల పూర్తి HD + రిజల్యూషన్‌తో కలిగి ఉంది.

 

Airtel Recharge Queue ప్రీపెయిడ్ ప్లాన్స్ ... కొంత కాలం కొత్త ధరకు గుడ్ బైAirtel Recharge Queue ప్రీపెయిడ్ ప్లాన్స్ ... కొంత కాలం కొత్త ధరకు గుడ్ బై

డిస్ప్లే

ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 టి మరియు వన్‌ప్లస్ 7 టి ప్రోలో చూసినట్లుగా ఉంటుంది. డిస్ప్లే 135HZ టచ్ శాంప్లింగ్ రేటు వరకు సామర్థ్యం కలిగి ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. రియల్‌మి ఎక్స్ 2 ప్రో మూడు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది అందులో 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్, 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మరియు 12 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా లిక్విడ్ కూలింగ్‌ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది మరియు ఇది 50W VOOC ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది.

 

సొంత OS తయారీ వేటలో ఒప్పో... చిప్‌సెట్‌ దిగ్గజాలకు పోటీ ఇవ్వగలదా!!!సొంత OS తయారీ వేటలో ఒప్పో... చిప్‌సెట్‌ దిగ్గజాలకు పోటీ ఇవ్వగలదా!!!

ఆప్టిక్స్

ఇందులో గల ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో డాల్బీ అట్మోస్ మరియు డ్యూయల్-బ్యాండ్ వైఫైతో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది. ఇది కలర్‌ఓఎస్ 6.1 తో రన్ అవుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme X2 Pro First Sale Live on Flipkart and Realme.com with More Cashback Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X