Realme x3 series sale: గొప్ప క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో మొదలైన అమ్మకాలు...
రియల్‌మి సంస్థ కొత్తగా తన 4G ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను ఇండియాలో గత వారంలో విడుదల చేసింది. రియల్‌మి X3 సిరీస్ పేరుతో విడుదల అయిన ఈ ఫోన్‌ల యొక్క మొదటి అమ్మకాలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రియల్‌మి.కామ్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలయినాయి.

రియల్‌మి X3 మరియు X3 సూపర్ జూమ్ సేల్స్
రియల్‌మి X3 మరియు X3 సూపర్ జూమ్ ఫోన్లను కొనాలనుకునే యూజర్ల కోసం రియల్‌మి సంస్థ అద్భుతమైన ఆఫర్లతో కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశం అందిస్తున్నది. రాబోయే వారాల్లో ఈ ఫోన్‌లను ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కూడా కొనుగోలు చేయడానికి సంస్థ అందుబాటులోకి తీసుకురానున్నది.

రియల్‌మి X3 మరియు X3 సూపర్ జూమ్ ఫోన్‌ల ధరల వివరాలు
రియల్‌మి X3 ఫ్లాగ్‌షిప్ ఫోన్ యొక్క 6GB ర్యామ్ / 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.24,999 మరియు 8GB ర్యామ్ / 128GB స్టోరేజ్ యొక్క వేరియంట్ ధర రూ.25,999. అలాగే రెండవ ఫోన్ రియల్‌మి X3 సూపర్‌జూమ్ యొక్క 8GB ర్యామ్ / 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.27,999 కాగా 12GB ర్యామ్ / 256GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.32,990.

రియల్‌మి X3 మరియు X3 సూపర్ జూమ్ సేల్స్ ఆఫర్స్
రియల్‌మి యొక్క కొత్త ఫోన్లు రియల్‌మి X3 మరియు X3 సూపర్ జూమ్ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేసే వారి కోసం సంస్థ లాంచ్ డే ఆఫర్‌లను అదనంగా అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వీటితో పాటుగా యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కూడా అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ ను పొందుతారు. లాంచ్ ఆఫర్లలో భాగంగా కొనుగోలుదారులు అదనంగా రూ.2,000 తగ్గింపును కూడా పొందుతారు.

రియల్‌మి X3 స్పెసిఫికేషన్స్
రియల్‌మి X3 ఫ్లాగ్‌షిప్ ఫోన్ FHD + రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే 60Hz మరియు 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో రెండు వేరు వేరు స్టోరేజ్ వేరియంట్లలో విడుదల అయ్యింది. ఇందులో మొదటిది 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మరియు రెండోది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్.

రియల్‌మి X3 ఫీచర్స్
రియల్‌మి X3 ఫ్లాగ్‌షిప్ ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో గల 64-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా శామ్‌సంగ్ GW1 సెన్సార్‌ను కలిగి ఉంది. దీనితో పాటుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా జతచేయబడి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరాలు కూడా జతచేయబడి ఉన్నాయి. ఈ ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు గల 4,200mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

రియల్‌మి X3 సూపర్‌జూమ్ స్పెసిఫికేషన్స్
రియల్‌మి X3 సూపర్‌జూమ్ స్మార్ట్ ఫోన్ 6.6-అంగుళాల LCD డిస్ప్లే FHD+ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క స్క్రీన్ కూడా రియల్‌మి X3 వలె 60Hz మరియు 120Hz రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ చేస్తుంది. ఈ X3 సూపర్‌జూమ్ ఫోన్‌లో యుఎఫ్‌ఎస్ 3.0 స్టోరేజ్ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉన్నాయి.

రియల్‌మి X3 సూపర్‌జూమ్ ఫీచర్స్
రియల్‌మి X3 సూపర్‌జూమ్ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో గల 64-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా శామ్‌సంగ్ GW1 సెన్సార్‌ను కలిగి ఉంది. దీనితో పాటుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా జతచేయబడి ఉన్నాయి. ఇందులో గల 8-మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ 60x వద్ద ఫోటోలను జూమ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. పెరిస్కోప్ లెన్స్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఇది షేక్‌ని తగ్గించి సుదూర షాట్‌లను సమర్థవంతంగా తీయడానికి సహాయపడుతుంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ గల డ్యూయల్ కెమెరా జత చేయబడి ఉంది.


Click it and Unblock the Notifications








