ISRO NAVIC నావిగేషన్ సిస్టమ్ సపోర్ట్ తో రియల్‌మి X50 ప్రో

|

రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో సోమవారం లాంచ్ చేశారు. ఇప్పుడు ఇది ఇస్రో యొక్క నావిక్ నావిగేషన్ సిస్టమ్‌కు మద్దతును ఇస్తున్నట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని రియల్‌మి ఇండియా యొక్క CEO మాధవ్‌ శేత్‌ చేసిన ట్వీట్‌లో మద్దతును ధృవీకరించారు.

రియల్‌మి ఫ్లాగ్‌షిప్
 

రియల్‌మి ఫ్లాగ్‌షిప్

రియల్‌మి సంస్థ యొక్క అంతిమ ఫ్లాగ్‌షిప్ లో భాగంగా రియల్‌మి X50 ప్రో ప్రస్తుతం ఇండియా యొక్క ఇస్రో నావిక్ నావిగేషన్ సిస్టమ్‌కు మద్దతును అందిస్తున్నది. అంతేకాకుండా ఇకమీదట రియల్‌మి నుండి రాబోయే ఫోన్లు అన్ని కూడా ఈ మద్దతును కలిగి ఉంటాయి. ఇస్రో యొక్క నావిక్ మద్దతుతో ప్రపంచంలోని మొట్టమొదటి మరియు రెండవది వరుసగా భారతదేశానికి వస్తోంది. మార్చి 5 న దీని గురించి పూర్తి సమాచారం అందిస్తాము"అని ట్వీట్‌లో మాధవ్ షెత్ తెలిపారు.

Reliance Jio తక్కువ ధరలో అందిస్తున్న 4G డేటా వోచర్‌ ప్లాన్‌లు

ట్విట్టర్‌

"@ మాధవ్‌షెత్ 1 నేను మీ అధికారిక వెబ్‌సైట్‌లో చూశాను, రియల్‌మి X50 ప్రో ఫీచర్స్ # నావిక్. భారతదేశంలో # నావిక్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదేనా?" ఒక వినియోగదారుడు ట్విట్టర్‌లో రియల్‌మి సీఈఓను అడిగారు. రియల్‌మి X50 ప్రో 5 జి స్పెసిఫికేషన్స్ పేజీలో నావిక్ మద్దతు స్పష్టంగా ఉంది అని ఆయన సమాధానంగా ట్వీట్ చేశారు. మిగిలిన వివరాలు రియల్‌మి 6 ను ప్రారంభిస్తున్న సమయంలో ప్రకటిస్తాము అని షెత్ ట్వీట్‌ చేసారు.

ఇస్రో నావిక్ మద్దతుతో వచ్చిన మొట్టమొదటి ఫోన్‌గా రియల్‌మి X50 ప్రోగా నిలిచింది. రియల్‌మి X50 ప్రో 5G ఫోన్ సంస్థ యొక్క తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC ను కలిగి ఉంది. అయితే నావిక్ టెక్ సపోర్ట్ కోసం క్వాల్కమ్ ప్రకటించిన ప్రకారం దీనికి మద్దతు ఉండటానికి స్నాప్‌డ్రాగన్ 720G, స్నాప్‌డ్రాగన్ 662 మరియు స్నాప్‌డ్రాగన్ 460 SoC లకు మాత్రమే పేరు పెట్టారు. నావిక్ టెక్నాలజీని కలిగి ఉన్న స్నాప్‌డ్రాగన్ 865 SoC లో ఇది ఎక్కడా ప్రస్తావించలేదు.

రియల్‌మి X50 ప్రో
 

రియల్‌మి X50 ప్రో

అందువల్ల సరికొత్త రియల్‌మి X50 ప్రోలోని నావిక్ సాఫ్ట్‌వేర్ ఆధారిత అదనంగా ఉందని ఇంకా నిర్ధారించబడలేదు. చిప్ ఇస్రో అభివృద్ధి చేసిన నావిగేషన్ టెక్నాలజీతో అమర్చబడిందా లేదా అని ఇంకా తెలియాలసి ఉంది.

Airtel Payments Bankలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌

రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో ఈవెంట్ లాంచ్

రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో ఈవెంట్ లాంచ్

ఇండియాలో రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో ఈవెంట్ లాంచ్ కార్యక్రమం మార్చి 5 న మధ్యాహ్నం 12:30 PM IST సమయం వద్ద ప్రారంభమవుతున్నట్లు సంస్థ యొక్క MD మాధవ్ సేథ్ ట్వీటర్ ద్వారా పోస్ట్ చేసాడు. ప్రస్తుతం కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. సల్మాన్ ఖాన్ చేతిలో గల రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల వీడియోను చిత్రీకరించి టీజర్ రూపంలో విడుదల చేసారు.

రియల్‌మి 6,6ప్రో ఇండియా ధరలు

రియల్‌మి 6,6ప్రో ఇండియా ధరలు

రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు పంచ్ హోల్ డిస్ప్లేను కలిగి ఉండి రూ.15000 ధరల పాయింట్‌ను కలిగి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల యొక్క వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ సెన్సర్ తో రావడం అతి పెద్ద విశేషం. రియల్‌మి సంస్థ మిడ్-రేంజ్ విభాగంలోని స్మార్ట్‌ఫోన్లలో 64 మెగాపిక్సెల్ కెమెరాను అందించే వాటిలో ఇదే మొదటిది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme X50 Pro 5G Comes with ISRO NavIC Navigation System Support

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X