Realme X7 5G ఫ్లాష్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో!! డిస్కౌంట్ ఆఫర్లు అనేకం...
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం నిర్వహిస్తున్న రియల్‌మి డేస్ అమ్మకం ఈ రోజు చివరి రోజు. ఈ అమ్మకంలో భాగంగా అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్లతో రియల్‌మి X7 5G ను కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశం లభిస్తున్నది. ఫ్లాష్ సేల్ పద్దతిలో మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చే ఈ ఫోన్ ను ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ మరియు సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ Realme.com లో నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ 5G ఫోన్ మీద ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేయడానికి రెండు ప్లాట్‌ఫారమ్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి X7 5G ధరల వివరాలు
రియల్‌మి X7 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 6GB ర్యామ్ / 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.19,999 కాగా 8GB ర్యామ్ / 128GB స్టోరేజ్ టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ధర రూ.21,999. ఇది స్పేస్ సిల్వర్ మరియు నెబ్యులా కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కామ్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా వినియోగదారులు పొందవచ్చు.

రియల్‌మి X7 5G సేల్ ఆఫర్స్
ఈ రోజు అమ్మకంలో భాగంగా యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోలుదారులకు EMI లావాదేవీలపై 7% తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉపయోగించి చేసిన లావాదేవీలపై 5% వరకు క్యాష్‌బ్యాక్ ఉంటుంది. ఈ ఫోన్ కొనుగోలు మీద నో-కాస్ట్ ఇఎంఐ నెలకు రూ.3,344 నుండి ప్రారంభమవుతుంది. నేటి అమ్మకంలో స్టాండర్డ్ EMI కొనుగోలు ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి.

రియల్‌మి X7 స్పెసిఫికేషన్స్
రియల్‌మి X7 స్మార్ట్ ఫోన్ 6.4-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 2400 × 1080 పిక్సెల్ రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఇది ARM మాలి- G57 MC3 GPU తో జత చేసిన డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్‌తో రన్ అవుతూ 6GB/ 8GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 పై మరియు రియల్‌మి UIతో రన్ అవుతూ 50W ఛార్జింగ్ మద్దతుతో కూడిన 4,310mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

రియల్‌మి X7 స్మార్ట్ ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు జత చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో హోల్ పంచ్ కెమెరా మాడ్యూల్ లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








