ఫ్లాష్ సేల్ ద్వారా అందుబాటులోకి Realme X7 Pro 5G!! అధిక డిస్కౌంట్ ఆఫర్లు...
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇటీవల విడుదల చేసిన రియల్‌మి X7 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలోని X7 ప్రో 5G మోడల్ నేడు మరోక ఫ్లాష్ సేల్ ద్వారా అమ్మకానికి రానున్నది. ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి.కామ్‌తో పాటు ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ నుండి కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహిస్తున్న రియల్‌మి డేస్ సేల్ లో యొక్క అన్ని రకాల డిస్కౌంట్ ఆఫర్లతో దీనిని మీ చేతిలో పొందవచ్చు. 65W ఫాస్ట్ ఛార్జింగ్, క్వాడ్-కెమెరా సెటప్ మరియు 5G ఫీచర్లతో లభించే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి X7 ప్రో ధరలు & సేల్ ఆఫర్స్ వివరాలు
రియల్‌మి X7 ప్రో స్మార్ట్‌ఫోన్ కేవలం 8GB ర్యామ్ / 128GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్‌లో ఫాంటసీ మరియు మిస్టిక్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క ధర రూ.29,999. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో జరుగుతున్న రియల్‌మి డేస్ అమ్మకంలో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ రోజు అమ్మకంలో భాగంగా కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మీద 5% వరకు అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే నో-కాస్ట్ EMI తో పాటుగా నెలకు రూ.5,000 నుండి ప్రారంభమయ్యే స్టాండర్డ్ EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి.

రియల్‌మి X7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
రియల్‌మి X7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.55-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 120HZ రిఫ్రెష్ రేటు మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో కలిగి ఉంది. ఇది 7nm తయారీ ప్రక్రియ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ 5G ప్రాసెసర్ ను కలిగి ఉండి ARM మాలి-జి 77MC 9 GPU తో మరియు 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడి వస్తుంది. ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉండి కంపెనీ యొక్క సొంత రియల్‌మి UI స్కిన్‌తో రన్ అవుతుంది. వీటన్నింటి కోసం ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో కూడిన 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

రియల్‌మి X7 ప్రో యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉంటాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








