Realme స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరలతో కొనుగోలు చేసే గొప్ప అవకాశం!!!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి తన యొక్క వెబ్ సైట్ లో కొత్తగా "రియల్‌మి యూత్ డేస్ సేల్" ని ప్రారంభించనున్నది. ఇండియాలో ఆగస్టు 24 నుంచి ఆగస్టు 28 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక అమ్మకాలలో రియల్‌మి యొక్క కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల మీద ధర తగ్గింపును అందిస్తున్నది. అలాగే ఈ ఐదు రోజుల అమ్మకంలో స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్లు మరియు స్మార్ట్‌వాచ్ ల కొనుగోలు మీద 60 శాతం వరకు మినహాయింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఐదు రోజుల అమ్మకాలలో ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ ఒప్పందాలు కూడా అదనంగా ఉంటాయి. ఇందులో భాగంగా రియల్‌మి 6, రియల్‌మి X2 ప్రో మరియు రియల్‌మి బ్యాండ్‌లను డిస్కౌంట్ ధరల వద్ద కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ల మీద డిస్కౌంట్ ధరలు
"రియల్‌మి యూత్ డేస్ సేల్" యొక్క అమ్మకాలు ఇండియాలో సోమవారం నుంచి కంపెనీ యొక్క ప్రత్యేక మైక్రోసైట్‌ను లైవ్ లో ఉంచుతుంది. అమ్మకం వ్యవధిలో సంస్థ అందించే అన్ని ఒప్పందాలను సైట్ లో ఎప్పటికప్పుడు ప్రివ్యూను అందిస్తుంది. రియల్‌మి 6, రియల్‌మి X2 ప్రో, రియల్‌మి X, రియల్‌మి X50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల మీద కూడా ధర తగ్గింపు ఉంటుందని రియల్‌మి పేర్కొంది. అయితే ధర తగ్గింపుపై ఖచ్చితమైన వివరాలు ఇంకా విడుదల చేయలేదు. రియల్‌మి యొక్క ఈ ఫోన్లను ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే కనుక దీని కంటే మంచి తరుణం మరొకటి లేకపోవచ్చు.

రియల్‌మి స్మార్ట్‌వాచ్ల మీద డిస్కౌంట్ ధరలు
స్మార్ట్‌వాచ్ వంటి వాటి విషయానికి వస్తే రియల్‌మి వాచ్ మరియు రూ.1459 ధర గల రియల్‌మి బ్యాండ్ ను రియల్‌మి యూత్ డేస్‌లో ధరల తగ్గింపును అందుకుంటున్నాయి. అమ్మకం సమయంలో మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యే ఫ్లాష్ అమ్మకాల సమయంలో రియల్‌మి బ్యాండ్ ను కేవలం రూ.1,169 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి బ్యాండ్ యొక్క అసలు ధర రూ.1,499 తో పోలిస్తే రూ.330 తక్కువ ధరకు లభిస్తుంది. అలాగే రియల్‌మి వాచ్ మీద లభించే ఖచ్చితమైన తగ్గింపు వివరాలు ఇంకా విడుదల చేయలేదు.

రియల్‌మి ఆడియో ఉత్పతుల మీద డిస్కౌంట్ ధరలు
రియల్‌మి యూత్ డేస్ అమ్మకంలో లభించే రియల్‌మి యొక్క ఆడియో ఉత్పతుల విషయానికి వస్తే రియల్‌మి బడ్స్ ఎయిర్ నియో, రియల్‌మి బడ్స్ క్యూ, రియల్‌మి బడ్స్ వైర్‌లెస్, మరియు రియల్‌మి బడ్స్ ఎయిర్ ల మీద కూడా తగ్గింపు ధరలు లభిస్తాయి. జూన్ 2020 లో రియల్‌మి బడ్స్ క్యూ ఇండియాలో రూ. 1,999 ధర వద్ద లాంచ్ అయింది . ఈ ఇయర్‌బడ్లు 10mm డైనమిక్ డ్రైవర్లను కలిగి ఉండి 4.5 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రియల్‌మి టోటె బాగ్ మరియు రియల్‌మి బ్యాక్‌ప్యాక్‌లతో పాటు 30W పవర్ బ్యాంక్ మీద కూడా డిస్కౌంట్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








