USB-C పోర్టుతో iPhone 15 ఫోన్లు విడుదల... ఆపిల్ నిర్ణయానికి అదే కారణమా..?
ఐఫోన్ 15 గురించి ఎప్పటి నుంచో అనేక వార్తలు వచ్చాయి. దీనిలో కీలక ఫీచర్లు సహా ఛార్జింగ్ కేబుల్‌లోనూ మార్పులున్నాయని అనేక లీక్‌లు వచ్చాయి. వాటిలో చాలా లీక్‌లను నిజం చేస్తూ సెప్టెంబర్ 12 మంగళవారం ఆపిల్ సంస్థ తన కొత్త ఫోన్లు ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ల ద్వారా ఆపిల్ ఫోన్ల ఛార్జింగ్ ఫోన్లకు చెక్‌పెట్టింది.
కొత్త విడుదల అయిన iPhone 15 సిరీస్ ఫోన్లను USB-C పోర్టుతో విడుదల చేసింది. ఈ కేబుల్ ద్వారానే ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్‌లను ఛార్జింగ్ చేయవచ్చు. ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతోపాటు విడుదల అయిన Airpods Pro 2nd Gen కూడా USB-C పోర్టునే కలిగి ఉంది. ఇది ఆపిల్ ఉత్పత్తుల్లో స్వాగతించదగిన మార్పుగా భావిస్తున్నారు.

ఆపిల్ సంస్థ గతంలో లైట్‌నింగ్ పోర్టును కలిగి ఉండేది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా USB-C పోర్టుకు మారుతూ వస్తోంది. ఇప్పటి వరకు అయితే ఐప్యాడ్, మ్యాక్‌బుక్‌ను ఒకే ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ చేయవచ్చు. కానీ ఐఫోన్, మ్యాక్‌బుక్‌ల ఛార్జింగ్ కోసం వేర్వేరు ఛార్జర్ అవసరం.
ఇప్పటికీ కొన్ని పాత ఐఫోన్ మోడళ్లు లైట్‌నింగ్ ఛార్జింగ్ పోర్టునే కలిగి ఉన్నాయి. అయితే ఆపిల్ తాజాగా తీసుకొచ్చిన టైప్-C పోర్టుతో డేటాను వేగంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే USB-3 కేబుల్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
2013వ సంవత్సరంలో ఐఫోన్ 5 ద్వారా తొలిసారిగా లైట్‌నింగ్ పోర్టును ఆపిల్ ప్రవేశపెట్టింది. సుమారు 10 సంవత్సరాలుగా అదే పోర్టును కొనసాగించింది. యూరోపియన్ యూనియన్ కారణంగా తన ఛార్జింగ్ పోర్టును మార్చాల్సి వచ్చింది. ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్‌కు ఒకేరకమైన పోర్టు ఉపయోగించాలని యూరోపియన్ యూనియన్ ప్రతిపాదించింది. ఇందుకు ఆ దేశ పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది. డిసెంబర్ 28, 2024 నాటికి వరకు గడువు విధించింది.
ఇప్పటికే ఆపిల్ ఉత్పత్తులు కొన్ని టైప్-C కేబుల్‌ను కలిగి ఉన్నాయి. ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ మినీ, మ్యాక్‌బుక్ ప్రో, మ్యాక్‌బుక్ ఎయిర్ ఇప్పటికే టైప్-C కేబుల్‌ను కలిగి ఉన్నాయి. ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్, మ్యాజిక్ కీబోర్డు, మ్యాజిక్ మౌస్ వంటి కొన్ని ఉత్పత్తులు ఇప్పటికి లైట్‌నింగ్ పోర్టును కలిగి ఉన్నాయి.
సెప్టెంబర్ 12న ఆపిల్ నిర్వహించిన వండర్ లస్ట్ ప్రత్యేక కార్యక్రమంలో ఐఫోన్ 15 సీరిస్ ఫోన్లు సహా ఆపిల్ వాచ్ సిరీస్9, వాచ్ అల్ట్రా 3 స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. దీంతోపాటు సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రోను విడుదల చేసింది. ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫోన్లు ఉన్నాయి.
గరిష్ఠంగా ఐఫోన్ 15 ప్రో మాక్స్ 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్ రూ.1,99,900ను కలిగి ఉంది. అంటే రూ.100 తక్కువ రెండు లక్షల రూపాయలగా ఉంది. భారత్‌లో తొలిసారిగా ఐఫోన్ ధర రెండు లక్షలకు చేరింది. ఈ ఫోన్ టెలీఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications