డ్యూయల్ స్మార్ట్‌ఫోన్లు... ఇబ్బందులు

Posted By:

ఇండియా వంటి ప్రముఖ మార్కెట్లలో డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లకు విపరీతమైన డిమాండ్. డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న అనేకమంది స్మార్ట్‌ఫోన్ యూజర్‌లు ఒక సిమ్‌ను కాలింగ్ కోసం. మరో సిమ్‌ను ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం వినియోగించటం జరుగుతోంది. మరికొంత మంది రెండు సిమ్ కార్డ్‌లను డైలింగ్ నిర్వహించుకునేందకు వినియోగిస్తున్నారు. అయితే, డ్యూయల్ సిమ్  స్మార్ట్‌ఫోన్‌లు ఎంత వరకు శ్రేయస్కరం..? డ్యూయల్ స్మార్ట్‌ఫోన్‌ల వల్ల చోటుచేసుకునే పలు ఇబ్బందును ఇప్పుడు చర్చించుకుందా....

డ్యూయల్ స్మార్ట్‌ఫోన్లు... ఇబ్బందులు

తికమక పడే సందర్భాలు చాలా ఎక్కువ:

డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించే చాలా మంది అనేక సందర్భాల్లో తికమకకు లోనవుతారు. ఇందుకు కారణం ఒక సిమ్‌లో నుంచి కాల్ మరొక సిమ్‌లోనుంచి చేయటం. ఒక సిమ్‌లో నుంచి పంపవల్సిన సందేశం మరొక సిమ్ నుంచి పంపటం. ఇలా అనేక సందర్భాల్లో డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ యూజర్తు తికమకపడుతున్నట్టు ఓ విశ్లేషణ.

బ్యాటరీ లైఫ్:

సింగిల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీతో పోలిస్తే డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా బ్యాకప్‌‌ను కొల్పోతుంది. ఇందుకు కారణం డ్యూయల్ సిమ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ రెండు  సిమ్‌లకు సంబంధించిన కనెక్టువిటీ అవసరాలకు శక్తిని సమకూర్చవల్సి ఉంటుంది.

చాలా తక్కువ ఆప్షన్‌లు:

అధిక ముగింపు ధరల్లో డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లసు సొంతం చేసుకుందామనుకునేవారికి చాలా కొద్దిపాటి ఆప్షన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot