Home
News

జియో "అన్ లిమిటెడ్" ఆఫర్.. ఏప్రిల్ 15 వరకు ఫ్రీగా హాట్‌స్టార్.. అందుకు ఈ ఒక్క పని చేస్తే చాలు..!

IPL 2025 Unlimited Offer: క్రికెట్ అభిమానులకు Jio మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. IPL 2025 సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, జియో తన 'అన్‌లిమిటెడ్' ఆఫర్‌ను 2025, ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. గత నెల మార్చిలో మొదలుపెట్టిన ఈ స్పెషల్ ఆఫర్‌కు అందరి నుంచి మంచి స్పందన రావడంతో, జియో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఆఫర్ కింద, కొన్ని ప్రత్యేక ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఇంతకుముందు ఈ ఆఫర్ మార్చి 31తో ముగియాల్సి ఉండగా, ఇప్పుడు ఏకంగా 2025, ఏప్రిల్ 15 వరకు అందుబాటులో ఉండనుంది.

Recharge Now Jio Free jioHotstar Until April 15

* రూ.299 రీఛార్జ్ చేస్తే చాలు.. 90 రోజులు ఫ్రీ హాట్‌స్టార్.
జియో కొత్త యూజర్లైనా, పాత యూజర్లైనా ఎవరైనా సరే, ఈ ఆఫర్ అందుకోవచ్చు. కేవలం రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే చాలు! ఇలా రీఛార్జ్ చేసుకున్న వెంటనే 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ఫ్రీగా వస్తుంది. అంటే IPL 2025 మ్యాచ్‌లను 4K క్వాలిటీలో మీ మొబైల్‌లో చూడొచ్చు.

ఫోన్‌లోనే కాదు టీవీలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేయొచ్చు. అంతేకాదు, ఈ రూ. 299 ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి. వీటితో పాటు జియో టీవీ, జియో క్లౌడ్ వంటి యాప్స్‌ను కూడా ఫ్రీగా వాడుకోవచ్చు.

* మార్చి 17 కంటే ముందు రీఛార్జ్ చేసిన వారికి స్పెషల్ ఆప్షన్..
మార్చి 17 కంటే ముందు రీఛార్జ్ చేసుకున్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూ.100 యాడ్-ఆన్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఈ ప్యాక్ తీసుకుంటే చాలు, మునుపటిలాగే 90 రోజుల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మీకు ఫ్రీగా వస్తుంది. మళ్లీ మొత్తం ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేనివారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

* జియోఫైబర్, ఎయిర్‌ఫైబర్‌పై 50 రోజుల ఫ్రీ ట్రయల్..
ఇంకాస్త ఎక్కువ వినోదం కావాలంటే, జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్‌ను కూడా ట్రై చేయొచ్చు. ఈ ఆఫర్ కింద, ఈ సర్వీసులపై 50 రోజుల ఫ్రీ ట్రయల్‌ను జియో అందిస్తోంది. ఈ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్‌లో అన్‌లిమిటెడ్ వై-ఫై, 800+ లైవ్ టీవీ ఛానెల్స్, 11 కంటే ఎక్కువ ఓటీటీ యాప్స్‌ను కూడా ఫ్రీగా చూడొచ్చు.

* అన్‌లిమిటెడ్ 5G.. హై డేటా ప్లాన్స్‌..
ఈ ఆఫర్ పీరియడ్‌లో అర్హత కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకున్న వారందరికీ వర్తిస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్ విషయంలోనూ జియో తగ్గట్లేదు. అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్‌ను ఆస్వాదించాలంటే, రోజుకు 2GB డేటా లేదా అంతకంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్స్‌ను ఎంచుకోవాలి.

* ఏప్రిల్ 15 వరకు మాత్రమే..
IPL 2025 సీజన్‌లో యూజర్లకు మరింత వాల్యూ ఇవ్వాలనే ఉద్దేశంతో జియో ఈ ఆఫర్‌ను పొడిగించింది. కేవలం రూ.299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే, హై-స్పీడ్ ఇంటర్నెట్, ప్రీమియం క్రికెట్ స్ట్రీమింగ్, అడ్వాన్స్‌డ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఇవన్నీ ఫ్రీగా పొందవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి.. ఈ ఆఫర్ ఏప్రిల్ 15 వరకు మాత్రమే.

More from GizBot

Best Mobiles in India

English summary
Recharge Now Jio Free jioHotstar Until April 15, Unlimited Offer Extends for IPL 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X