ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటే జరిగేది ఇదే..

నేడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్‌కి బానిసలుగా మారిపోయిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం.

|

నేడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్‌కి బానిసలుగా మారిపోయిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం. పోమరస్టులు పెట్టడం లైకులు కామెంట్లు షేర్లు చూసుకోవడం ఇంకా అప్ డేట్స్ చూసుకోవడం లాంటివి చేస్తూనే ఉన్నాం. అయితే ఫేస్‌బుక్‌కి బానిస కాని వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. బానిస అయిన వారి పరిస్థితి ఏంటీ. దీన్ని వారంపాటు వదిలేస్తే వారి ప్రపంచం ఎలా ఉంటుంది. ఇలాంటి విషయాల మీద అమెరికాకు చెందిన స్టాన్‌ఫర్డ్, న్యూయార్క్‌ యూనివర్సిటీ (ఎన్‌వైయూ)లు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించాయి.

 

Meizu Zero.. ఈ ఫోన్ ఖరీదు రూ.92,000, ప్రత్యేకతలెన్నో..Meizu Zero.. ఈ ఫోన్ ఖరీదు రూ.92,000, ప్రత్యేకతలెన్నో..

సవాల్‌

సవాల్‌

కాగా గత ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు ముందు ఫేస్‌బుక్‌కి ఏడాది పాటు దూరంగా ఉంటే వెయ్యి నుంచి రెండు వేల డాలర్లు ఇస్తామంటూ ఎఫ్‌బీ వినియోగదారులకు సవాల్‌ విసిరాయి.

2,844 మంది

2,844 మంది

డబ్బులకి ఆశపడో, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండడమే మంచిదని భావించారో, కారణం ఏదైనా ఎందరో ఔత్సాహికులు ఈ సవాల్‌ స్వీకరించారు. మొత్తం 2,844 మంది ప్రయోగాత్మకంగా తమ ఫేస్‌బుక్‌ అకౌంట్లను నాలుగు వారాల పాటు డీ యాక్టివేట్‌ చేశారు.

అనూహ్య మార్పులు
 

అనూహ్య మార్పులు

ఆ సమయంలో వారి నిత్య జీవితంలో ఎలాంటి అనూహ్య మార్పులు వచ్చాయో ఆ అధ్యయనం వెల్లడించింది. ఆ అధ్యయనం వివరాలను సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ నెట్‌వర్క్‌ ప్రచురించింది. దూరంగా ఉండటం వల్ల బంధు మిత్రులతో హాయిగా గడిపటం, ఆన్‌లైన్‌లో ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు చదివి పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, రోజులో గంట సేపు ఖాళీ సమయం దొరకడం లాంటివి చేశారట.

వీటికి దూరంగా ..

వీటికి దూరంగా ..

ఇంకా రాజకీయపరమైన భావోద్వేగాలను నియంత్రించుకోగలిగారు. నకిలీ వార్తలకు బదులుగా బయట ప్రపంచంలో జరుగుతున్న నిజాలు తెలుసుకొని నిష్పక్షపాతంగా ఆలోచించే నేర్పు వచ్చింది. మానసిక ఒత్తిడికి దూరమై జీవితం పట్ల ఓ రకమైన సంతృప్తి కలిగింది. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, టీవీ చూడడం వంటి పాత అభిరుచుల వైపు మళ్లీ ఆసక్తి కలిగిందని వారు తెలిపారు.

అలవాటు మానుకోలేకపోయారు

అలవాటు మానుకోలేకపోయారు

సర్వేలో పాల్గొన్నవారిలో 25-40 శాతం మంది ఫేస్‌బుక్‌ అలవాటు మానుకోలేక మొదటి వారంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. దీంతో అధ్యయనకారులు వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి వచ్చింది. అలా ఒత్తిడికి లోనైనవారందరినీ ఒకేచోటకి చేర్చి దేనికైనా బానిసలుగా మారడం మంచిది కాదంటూ పాఠాలు చెప్పాల్సి వచ్చిందని అధ్యయనం తెలిపింది.

నెలరోజులు ఎఫ్‌బీకి దూరంగా ఉంటే

నెలరోజులు ఎఫ్‌బీకి దూరంగా ఉంటే

నెలరోజుల పాటు ఫేస్‌బుక్‌ వైపు కూడా ముఖం చూడని వారిని మరో నెలరోజులు ఎఫ్‌బీకి దూరంగా ఉంటే మీకు ఎంత డబ్బులివ్వాలి అని అడిగితే వందలోపు డాలర్లు ఇచ్చినా సరే హాయిగా ఫేస్‌బుక్‌ని వదిలేస్తామంటూ సమాధానం ఇవ్వడం విశేషం.

Best Mobiles in India

English summary
Recommended Reading: What happens to your brain when you quit Facebook? More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X