Home
News

ఎరుపు మెరుపు లేనట్టే!

నిలిచిపోయిన ఐఫోన్ 7 మరియు 7ప్లస్ అమ్మకాలు

By Madhavi Lagishetty

ఐఫోన్7, 7ప్లస్ స్మార్ట్ ఫోన్లతో ఆపిల్ ఏడాది క్రితం తన మార్కెట్ను మరింతగా పెంచుకుంది. ఆపిల్ నుంచి వచ్చిన మొదటి కలర్ వేరియంట్ స్మార్ట్ ఫోన్లు కావడంతో కంపెనీ టాప్ ప్లేస్ లో నిలిచింది. మరి యూత్ ను అంతగా ఆకట్టుకున్న ఐఫోన్ 7, 7ప్లస్ లో ఇక కనుమరుగవనున్నాయా? అంటే అవుననే చెప్పువచ్చు.

Red Apple iPhone 7 and 7 Plus discontinued

కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో ఐఫోన్ 8 మరియు ఐఫోన్ 8 ప్లస్ ను ఐఫోన్ ఎక్స్ తో కలిసి ప్రారంభించారు. అదే కార్యక్రమంలో రెడ్ ఐఫోన్ 7, 7ప్లస్ స్మార్ట్ ఫోన్లు నిలిచిపోనున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

మార్చిలో ఆపిల్ ఐఫోన్7 మరియు 7 ప్లస్ నుంచి రెడ్ కలర్ వేరియంట్ను లాంచ్ చేసింది. గతేడాది సెప్టెంబర్ లో ఈ ఫోన్లను రిలీజ్ చేసిన ఆరు నెలల తర్వాత...ఈ వేరియంట్ ప్రారంభమైంది. ఆఫ్రికల్ ఖండంలో HIV/AIDS వ్యాప్తిని నివారించడానికి గ్లోబల్ ఫండ్ కు ఇచ్చే ఆదాయంతో యాపిల్ మరియు రెడ్ మధ్య భాగస్వామ్యం పది సంవత్సరాలు ఉండేందుకు రెడ్ ఐఫోన్స్ ప్రారంభించబడ్డాయి. ఆఫ్రికన్ గ్లోబల్ ఫండ్ కు ప్రొడక్టుల యొక్క రెడ్ లైనప్ అమ్మకాలలో ఆపిల్ కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చింది.

ఇప్పుడు, ఆపిల్ రెడ్ ఐఫోన్ 7 మరియు ఐఫోన్ 7 ప్లస్ నిలిపివేస్తున్నట్లు ప్రకటిచింది. రెడ్ వెర్షన్ అమ్మకం కోసం ఇకపై ఎలాంటి లిస్ట్ ఇవ్వదు. అయితే, ఆపిల్ ప్రొడక్ట్స్ యొక్క రెడె వేరియంట్స్ అమెజాన్ మరియు బెస్ట్ బై వంటి రిటైలర్ల ద్వారా ఇప్పటికీ అందుబాటులో ఉంటాయి.

స్టాక్స్ ఖాళీ అయ్యేంత వరకు ఆన్ లైన్ రిటైలర్లు ఈ డివైస్సులను విక్రయించడం కొనసాగుతుంది. కానీ వారు సంస్థ నుంచి కొత్త స్టాక్ ఇకపై పొందలేరు. కాబట్టి ఐఫోన్ 7 రెడ్ వేరియంట్ కొనుగోలు చేయాలనుకునేవారు తమ తొందరగా కొనుగోలు చేయడం బెస్ట్ .

గోల్డ్, సిల్వర్, జెట్ బ్లాక్, రోజ్ గోల్డ్, మాట్టే బ్లాక్ కలర్ వేరియంట్లలో ఐప్యాడ్ యొక్క పాత నమూనాలను ఆపిల్ ఇప్పటికి విక్రయిస్తుంది. ఐఫోన్ రెడ్ వేరియంట్ తోపాటు 7 స్మార్ట్ ఫోన్లు 256జిబి వేరియంట్ కూడా స్టాప్ చేశారు. ఇప్పటి నుంచి ఐఫోన్ 7 మరియు 7 ప్లస్ 32జిబి మరియు 128జిబి రకాలు మాత్రమే కొనుగోలు కోసం అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
Apple has discontinued the Red color variant of the iPhone 7 and 7 Plus and the same will no more be listed for sale.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X