రూ.2.42 లక్షల కోట్లతో IBM కొత్త స్కెచ్,రెడ్‌ హ్యట్‌ సొంతం

By Gizbot Bureau
|

ప్రముఖ సాప్ట్‌వేర్‌ దిగ్గజం ఐబిఏం సంస్థ అమెరికాకు చెందిన రెడ్‌ హ్యట్‌ సంస్థను 34 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మన కరెన్సీలో ఈ డీల్ విలువ దాదాపు రూ.2.42 లక్షల కోట్లకు సమానం. వందేళ్ల IBM చరిత్రలో ఇదే అతిపెద్ద డీల్ కావడం విశేషం. తాజా ఒప్పందంతో IBM సంస్థ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల్లోకి ప్రవేశించినట్లయింది.

red-hat-the-company-ibms-buying-for-34-billion-dollars

క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో అడుగుపెట్టేందుకు సాప్ట్‌వేర్‌ కంపెనీ రెడ్‌ హ్యట్‌ను 34బిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్టు ఈ టెక్నాలజీ దిగ్గజం వెల్లడించింది. మెరుగైన లాభాలను ఆర్జిస్తూ వంద ఏళ్ల చరిత్ర ఉన్న రెడ్‌ హ్యట్‌ కంపెనీని గత ఏడాది ఐబిఏం కొనుగోలు చేయడానికి నిర్ణయించింది.

 క్లౌడ్‌ కంప్యూటింగ్‌లపై దృష్టి

క్లౌడ్‌ కంప్యూటింగ్‌లపై దృష్టి

ఐబిఏం చీఫ్‌ ఎగ్జక్యూటివ్‌ గిన్ని రోమెట్టి సాంప్రదాయ హర్ఢ్‌వేర్‌ ఉత్పత్తులను తగ్గించి, వేగంగా అభివృద్ది చెందుతున్నసాప్ట్‌వేర్‌ సేవలపై, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లపై దృష్టి పెట్టడంతో ఈ భారీ కొనుగోలుకు మార్గం సుగమమైంది. కాగా తొలితరం కంప్యూటర్ రంగంలో ఐబిఎం సంస్థ అగ్రగామిగా ఉన్నప్పటికీ వేగంగా విస్తరిస్తున్న క్లౌడ్ సేవల విషయంలో మాత్రం వెనుకబడే ఉంది. తాజా డీల్ తో ఆ లోటు కాస్తా తీరింది.

1993లో రెడ్‌ హ్యట్‌ స్థాపన

1993లో రెడ్‌ హ్యట్‌ స్థాపన

63 శాతం ప్రీమియంతో రెడ్‌ హ్యట్‌ షేర్లను ​కొనుగోలు చేయడానికి జూన్‌ నెలఖారున ఈయు రెగ్యులేటర్లు, మే నెలలో యుఏస్‌ రెగ్యులేటర్లు ఐబిఏం ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. 1993లో స్థాపించిన రెడ్‌ హ్యట్‌ సంస్థ లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో ప్రత్యేకతను ఎర్పరుచుకుంది. ఇది మైక్రోసాప్ట్‌ కార్ప్‌చే తయారు చేయబడిన సాప్ట్‌వేర్‌కు కంటే భిన్నంగా ఉండి, ఓపెన్‌ సోర్స్‌ సాప్టవేర్‌గా లైనక్స్‌ అత్యంత ఆదరణ పోందింది.

2 వేల మంది ఉద్యోగులపై వేటు
 

2 వేల మంది ఉద్యోగులపై వేటు

ఇదిలా ఉంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) గత నెలలో 2 వేల మంది ఉద్యోగులపై వేటేసింది. ఐబీఎంలో మొత్తం 3,50,600 మంది ఉద్యోగులు ఉండగా, ఇప్పుడు తొలగించిన వారి సంఖ్య అందులో ఒకశాతంగా కంపెనీ పేర్కొంది. తొలగించిన ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువని, పోటీకి తగ్గట్టుగా వారి ప్రదర్శన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

2017లో మరింత మందిని

2017లో మరింత మందిని

2016లో ఆర్మోంక్ అనే న్యూయార్క్‌కు చెందిన కంపెనీ అమెరికాలో ఉద్యోగుల కోత మొదలుపెట్టింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‌వైపు తమ ఉద్యోగులను మళ్లించే ఉద్దేశంతో వ్యూహాత్మంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2017లో మరింత మందిని ఈ సంస్థ తొలగించింది. టెక్నాలజీ రంగంలో ఐబీఎం గత కొన్నేళ్లుగా వెనకబడింది. 2018లో ఐబీఎం ఆదాయంలో కేవలం ఒకశాతం మాత్రమే వృద్ధి నమోదైంది. బిజినెస్ రానురాను పడిపోతుండడంతో గత కొంతకాలంగా ఉద్యోగులకు లేఆఫ్ ఇస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది.

Best Mobiles in India

English summary
The Company IBM's Buying For 34 Billion Dollars

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X