Home
News

24GB RAM తో, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ ఇదే!

By Maheswara

ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులు తమ ఫోన్‌లలో అత్యుత్తమమైన మరియు ఉన్నతమైన స్పెసిఫికేషన్‌లను తీసుకురావడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నందుకు చాలా కాలంగా పోటీ పడుతున్నారు. ఈ రోజు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఫోన్‌లలో 200MP కెమెరాలు మరియు 210W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్న ఫోన్‌లను మనం చూస్తున్నాము.ఇప్పుడు, భారీ 24GB RAM కలిగిన మొదటి ఫోన్‌ను నుబియా యొక్క రెడ్‌మ్యాజిక్ ప్రకటించింది.

అవును, అందరి అంచనాలను తారుమారు చేస్తూ, నుబియా యొక్క ఈ రెడ్‌మ్యాజిక్ ద్వారా కొత్త రెడ్‌మ్యాజిక్ 8ఎస్ ప్రో 24 జిబి ర్యామ్‌తో లోడ్ చేయబడుతుందని భావిస్తున్నారు. ప్రపంచంలో 24GB RAM తో రాబోతున్నఈ రకమైన ఫోన్లలో ఇదే మొదటిది. దీన్ని అధికారిక Weibo పోస్ట్‌లో నుబియా సంస్థ ధృవీకరించింది. దీని వివరాలు నిశితంగా తెలుసుకుందాం.

Red Magic 8S Pro: The Worlds First 24GB RAM Smartphone To Launch On July 5, Leaked Details Here.

Red Magic 8S Pro స్మార్ట్ ఫోన్ 24GB RAM కలిగి ఉంటుంది
నుబియా ఇప్పుడు లాంచ్ చేయబోయే RedMagic 8S pro ఫోన్ 24GB RAM సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ధృవీకరించింది. వర్చువల్ ర్యామ్‌ని ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యమవుతుందా అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, అది జరగదు. ఈ ఫోన్ నిజానికి 24GB ఫిజికల్ ర్యామ్‌ను కలిగి ఉంటుంది.

ఈ భారీ ర్యామ్ కెపాసిటీ వల్ల వినియోగదారులకు చాలా వేగమైన మరియు సున్నితమైన అనుభవం. భారీ ర్యామ్ సహాయంతో గేమింగ్, హెవీ ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ అన్నీ సులభంగా మరియు వేగంగా చేయబడతాయి. సాధారణముగా ఫోన్‌లకు ఈ సామర్థ్యం అవసరమా లేదా కస్టమర్‌లను ఆకర్షించడానికి జోడించిన మరో పెద్ద సంఖ్యా అనేది పెద్ద ప్రశ్న.

ఈ 24GB RAM తో ఫోన్లను లాంచ్ చేయాలనీ OnePlus మరియు Realme అనే మరో రెండు బ్రాండ్‌లు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సంస్థలు కూడా 24GB RAMతో వచ్చే ఫోన్‌ల పై పనిచేస్తున్నాయని పుకార్లు ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న కొత్త ఫోన్లు, OnePlus Ace 2 Pro ఈ 24GB ర్యామ్‌తో కూడా వస్తుందని భావిస్తున్నారు.

నుబియా రెడ్ మ్యాజిక్ 8ఎస్ ప్రో: స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ డేట్ వివరాలు
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ యొక్క ఓవర్‌లాక్డ్ వెర్షన్‌తో వస్తుందని మాతృ సంస్థ ధృవీకరించింది. ఇది ప్రామాణిక మోడల్‌లోని 3.19GHz వేగం కంటే 3.36GHz క్లాక్ స్పీడ్‌ని కలిగి ఉంటుంది. జూలై 5న చైనాలో జరిగే ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

రెడ్ మ్యాజిక్ 8ఎస్ ప్రో యొక్క ఇతర స్పెసిఫికేషన్‌లు ఇంతకుముందు లాంచ్ చేసిన రెడ్‌మ్యాజిక్ 8 ప్రో మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు. అంటే ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది వెనుకవైపు 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 16MP అండర్-డిస్ప్లే ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6000mAh బ్యాటరీతో లోడ్ అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Red Magic 8S Pro: The World's First 24GB RAM Smartphone To Launch On July 5, Leaked Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X