రెడ్‌మి 10 కొత్త వేరియంట్ ఇండియాలో లాంచ్ అయింది! ధర వివరాలు
రెడ్‌మి గత సంవత్సరం భారతదేశంలో లాంచ్ చేసిన రెడ్‌మి 10 ఫోన్ యొక్క కొత్త రంగు వేరియంట్ ఇప్పుడు లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మి 10 యొక్క కొత్త సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ వేరియంట్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇప్పటికే ఉన్న రెడ్ మీ 10 ఫోన్ ఫీచర్లతోనే వస్తుంది.
ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో 6.7-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ, స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 తో పనిచేస్తుంది. మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 SoC ప్రాసెసర్ తో ఇది పనిచేస్తుంది, 4GB RAM మరియు 64 GB అంతర్నిర్మిత స్టోరేజీ తో జత చేయబడింది.

భారతదేశంలో రెడ్‌మి 10 సన్‌రైజ్ ఆరెంజ్ వేరియంట్ యొక్క ధర, లభ్యత వివరాలు
భారతదేశంలో రెడ్‌మి 10 సన్‌రైజ్ ఆరెంజ్ వేరియంట్ ధర 4GB + 64GB RAM మరియు స్టోరేజ్ మోడల్ కోసం రూ.9,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
రెడ్‌మి 10 సన్‌రైజ్ ఆరెంజ్ వేరియంట్ స్పెసిఫికేషన్ల వివరాలు
రెడ్‌మి 10 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 తో పనిచేస్తుంది. మరియు ఇది డ్యూయల్ SIM (నానో)కి మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే 400 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశం మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో ఉంటుంది. ఈ రెడ్‌మి 10 ఫోన్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. అడ్రినో 610 GPU మరియు 4GB వరకు LPDDR4X RAMతో ఇది జత చేయబడింది.
ఇక ఈ ఫోన్ యొక్క కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, ఈ ఫోన్ f/1.8 లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ హెడ్‌లైన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.వెనుక ప్యానెల్‌లో LED ఫ్లాష్ కూడా వస్తుంది. ఇక ముందు వైపు సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది.
ఇక చివరగా ఈ ఫోన్ యొక్క కనెక్టివిటీ మరియు బ్యాటరీ వివరాలను గమనిస్తే, ఇది 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, ప్రాక్సిమిటీ సెన్సార్ మరియు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. రెడ్‌మి 10 ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 169.59x76.56x9.13mm కొలతలు మరియు 203 గ్రాముల బరువు తో ఉంటుంది.
రెడ్ మీ అధికారికంగా తమ కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఇటీవలే ధృవీకరించింది. ఈ టెక్నాలజీ ద్వారా 300W ఇమ్మోర్టల్ సెకండ్ ఛార్జర్, కేవలం ఐదు నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ అవుతుంది.త్వరలో లాంచ్ కాబోయే రెడ్ మీ నోట్ 12 డిస్కవరీ ఎడిషన్ లో ఈ కొత్త ఛార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేయనున్నట్లు సమాచారం ఉంది.


Click it and Unblock the Notifications








