Home
News

Redmi 10 పవర్ కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో

షియోమి సబ్-బ్రాండ్ రెడ్‌మీ భారతదేశంలో ఈ రోజు రెడ్‌మి 10A బడ్జెట్ ఫోన్ తో పాటుగా రెడ్‌మి 10 పవర్ స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 2021లో ప్రారంభించబడిన రెడ్‌మి 9 పవర్‌కు అప్ డేట్ వెర్షన్ గా విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా రన్ అవుతూ 8GB వరకు RAMతో జత చేయబడింది వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో 6.7-అంగుళాల IPS LCD డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి 10 పవర్ ధరల వివరాలు

రెడ్‌మి 10 పవర్ ధరల వివరాలు

రెడ్‌మి 10 పవర్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. 8GB RAM + 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ యొక్క ధర రూ.14,999. ఇది పవర్ బ్లాక్ మరియు స్పోర్టీ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అయింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు అమ్మకానికి వస్తుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు కానీ ఇది Mi.com, Mi Home, అమెజాన్ మరియు రిటైల్ భాగస్వాముల ద్వారా విక్రయించబడుతుందని కంపెనీ తెలిపింది.

రెడ్‌మీ 10 పవర్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మీ 10 పవర్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మీ 10 పవర్ స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 13తో రన్ అవుతుంది. ఇది 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది అడ్రినో 610 GPU మరియు 8GB LPDDR4x ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతుంది. 3GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు అందుబాటులో ఉన్న RAMని వర్చువల్‌గా విస్తరించుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఆప్టిక్స్

రెడ్‌మీ 10 పవర్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చరు లెన్స్ మరియు f/2.4 ఎపర్చరు లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ మరియు పోర్ట్రెయిట్ సెన్సార్‌తో 2-మెగాపిక్సెల్ కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.0 ఎపర్చరు లెన్స్‌తో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

 

 

బ్యాటరీ

రెడ్‌మీ 10 పవర్ స్మార్ట్‌ఫోన్ 128GB UFS 2.2 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి వీలుగా ఉంటుంది. అలాగే కనెక్టివిటీ ఎంపికల విషయంలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో బయోమెట్రిక్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్ మరియు బ్యాక్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. చివరిగా ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Redmi 10 Power Smartphone Launched in India With Qualcomm Snapdragon 680 SoC: Price, Specs, Sale Date, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X