Just In
- 5 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 7 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 10 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 12 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
5న తెలంగాణ కేబినెట్ భేటీ: బడ్జెట్ ఆమోదం
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Redmi 10 స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి!! కొత్త ధరలు, డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే..
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమి ఇండియాలో మార్చిలో విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 10 ఇప్పుడు మరింత సరసమైనదిగా మారింది. ఈ సంవత్సరంలో విడుదలైన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఇప్పుడు ధర తగ్గింపును అందుకున్నది. భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ ను 4GB+64GB మరియు 6GB+128GB వంటి రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. కంపెనీ ఇప్పుడు ఈ రెండు వేరియంట్‌ల ధరలను తగ్గించింది.

రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ కొత్త ధరల వివరాలు
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఇండియాలో Redmi 10 ని రెండు వేరియంట్‌లలో ప్రారంభించింది. 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ రూ.10,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ +128GB స్టోరేజ్ రూ.12,999 ధరల వద్ద లాంచ్ అయ్యాయి. అయితే ఇప్పుడు 4GB RAM వేరియంట్ రూ.1,000 ధరను తగ్గించడంతో ఇప్పుడు రూ.9,999 ధర వద్ద అందుబాటులో ఉంది. మరోవైపు 6GB RAM వేరియంట్ ఎంపిక మీద రూ.500 తగ్గింపును అందుకొని వినియోగదారులకు రూ.12,499 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

రెడ్‌మీ 10 కంపెనీ డిస్కౌంట్ ఆఫర్
రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ యొక్క కొత్త ధరలు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పుడు కనిపిస్తున్నాయి. వినియోగదారులు రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ ని పసిఫిక్ బ్లూ, కరేబియన్ గ్రీన్ మరియు మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. mi.com నుండి రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ ని కొనుగోలు చేసే కస్టమర్‌లు ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ.1,250 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీనితో పాటు కంపెనీ 6GB RAM వేరియంట్‌పై రూ.500 అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది.

రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ -ఆధారిత MIUI 12.5పై రన్ అవుతుంది. అలాగే ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.53-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ప్రొసెసర్ ద్వారా శక్తిని పొందుతూ గరిష్టంగా 6GB RAMతో జతచేయబడి వస్తుంది.

రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుకభాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మరియు f/2.2 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ కెమెరాను LED ఫ్లాష్ తో కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది 128GB వరకు స్టోరేజ్ తో లభిస్తుంది. ఇందులోని ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్‌ను ఉపయోగించి మెమొరీని 512GB వరకు విస్తరించడానికి మద్దతును ఇస్తుంది.

రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 5 మరియు GPS/ A-GPS ఉన్నాయి. ఈ ఫోన్‌లో మైక్రో-USB పోర్ట్ అలాగే 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంది. ఫోన్ సైడ్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చివరిగా ఇది 18W ఛార్జర్‌తో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి 164.9x77.07x9mm కొలతలతో 194g బరువుతో లభిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470