Home
News

Redmi 10A కొత్త స్మార్ట్‌ఫోన్ రూ.10000 లోపు బడ్జెట్ ధరలో ఎంత ప్రత్యేకంగా ఉంది...

షియోమి సబ్-బ్రాండ్ రెడ్‌మీ భారతదేశంలో ఈ రోజు బడ్జెట్ ధరలో రెడ్‌మీ 10A మోడల్‌ను లాంచ్ చేసింది. 2020లో దేశంలో ప్రారంభించబడిన రెడ్‌మీ 9Aకి అప్ డేట్ వెర్షన్ గా వస్తున్నప్పటికి కూడా దాని ముందుతరం వాటితో కొన్ని సారూప్యతలను కలిగి ఉన్నది. ఇది మీడియాటెక్ హీలియో G25 SoC ద్వారా రన్ అవుతూ వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ సింగిల్ కెమెరాతో ప్యాక్ చేయబడి ఉంటుంది. అలాగే రెడ్‌మీ10A కొన్ని అప్‌గ్రేడ్‌లను కలిగి ఉండి 64GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది. ఇండియాలోని స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో రెడ్‌మీ 10A కొత్త ఫోన్ బడ్జెట్ విభాగంలో టెక్నో పోవా నియో, రియల్‌మి, C11 (2021) మరియు Samsung Galaxy M02 వంటి వాటితో గట్టి పోటీని ఎదురుకోనున్నది. అయితే ఈ బడ్జెట్ విభాగంలో ఇది ఎంత ప్రత్యేకంగా ఉందొ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మీ 10A ధరల వివరాలు

రెడ్‌మీ 10A ధరల వివరాలు

రెడ్‌మీ 10A స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 3GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ. 8,499 కాగా 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.9,499. ఇది చార్‌కోల్ బ్లాక్, సీ బ్లూ మరియు స్లేట్ గ్రే కలర్ లలో లభిస్తుంది. ఇది ఏప్రిల్ 26 నుండి మధ్యాహ్నం 12 గంటలకు షియోమి వెబ్‌సైట్ మరియు షియోమి అధికారిక స్టోర్‌ల ద్వారా దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మీ 10A స్పెసిఫికేషన్స్

రెడ్‌మీ 10A స్పెసిఫికేషన్స్

రెడ్‌మీ 10A స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ -ఆధారిత MIUI 12.5పై రన్ అవుతుంది. అలాగే ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.53-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ ఆక్టా-కోర్ MediaTek Helio G25 SoC ద్వారా శక్తిని పొందుతూ గరిష్టంగా 4GB RAMతో జతచేయబడి వస్తుంది.

ఆప్టిక్స్

రెడ్‌మీ 10A స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుకభాగంలో 13-మెగాపిక్సెల్ ఒకే ఒక సింగిల్ కెమెరాను కలిగి ఉంది. ఇది f/2.2 ఎపర్చరుతో పాటుగా LED ఫ్లాష్ ను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది 64GB వరకు స్టోరేజ్ తో లభిస్తుంది. ఇందులోని ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్‌ను ఉపయోగించి మెమొరీని 512GB వరకు విస్తరించడానికి మద్దతును ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 5 మరియు GPS/ A-GPS ఉన్నాయి. ఈ ఫోన్‌లో మైక్రో-USB పోర్ట్ అలాగే 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంది. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చివరిగా ఇది 10W ఛార్జర్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి 164.9x77.07x9mm కొలతలతో 194g బరువుతో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Redmi 10A Budget Smartphone Launched in India With MediaTek Helio G25 SoC: Price, specs, Sales Offers and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X