రెడ్‌మి నోట్ 10s స్మార్ట్‌ఫోన్‌ ధరలు రూ.2000 వరకు భారీగా తగ్గాయి!!

|

చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమి యొక్క సబ్-బ్రాండ్ రెడ్‌మి భారతదేశంలో అందుబాటు ధరలో రెడ్‌మి నోట్ 10s ను మే 2021లో లాంచ్ చేసింది. అందుబాటు ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఇది మరింత ఆకర్షణీయంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నది. రెడ్‌మి బ్రాండ్ యొక్క ఈ ఫోన్ ని మరింత ఆకర్షనీయంగా మార్చడానికి భారతదేశంలో ఈ హ్యాండ్‌సెట్ ధరను తగ్గించాలని కంపెనీ నిర్ణయించుకుంది. దాదాపుగా రూ.2000 వరకు ధర తగ్గింపును అందుకున్న తరువాత ఈ ఫోన్ అందరికి అందుబాటు ధరలో లభిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రెడ్‌మి నోట్ 10s తగ్గింపు ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 10s తగ్గింపు ధరల వివరాలు

ఇండియాలో రెడ్‌మి నోట్ 10s ఫోన్ 6GB ర్యామ్ + 64GB, 128GB స్టోరేజ్ వంటి రెండు వేరియంట్‌లలో వరుసగా రూ.14999 మరియు రూ.15,999 ధరల వద్ద డీప్ సీ బ్లూ, ఫ్రాస్ట్ వైట్ మరియు షాడో బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. అయితే ఇప్పుడు ఈ మోడల్స్ మీద రూ.2000 వరకు ధర తగ్గింపును అందుకున్న తరువాత 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌ రూ.12,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.14,999 ధరల వద్ద లభిస్తుంది. ఈ తగ్గింపు ధరలు శాశ్వతంగా ఉంటుందో లేదో అన్న దానికి అధికారిక నిర్ధారణ లేదు. ఈ ధర తగ్గింపు ఇప్పటికే అమెజాన్ మరియు Mi.comలో ప్రతిబింబిస్తోంది.

రెడ్‌మి నోట్ 10s స్పెసిఫికేషన్స్
 

రెడ్‌మి నోట్ 10s స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10s యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5 పై తో రన్ అవుతువుంది. ఇది HDR-10 మద్దతు మరియు TÜV రీన్‌ల్యాండ్ తో 6.43-అంగుళాల ఫుల్-HD + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూ లైట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 జి SoC చేత శక్తినిస్తుంది, దీనితో పాటు అడ్రినో 618 జిపియు మరియు 8 జిబి వరకు LPDDR4x ర్యామ్ ఉన్నాయి.

ఆప్టిక్స్

రెడ్‌మి నోట్ 10s యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్ తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, ఎఫ్ / 2.4 ఎపర్చరుతో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.45 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను పంచ్-హోల్ కటౌట్‌లో కేంద్రీకృతమై ప్యాక్ చేయబడి ఉంటుంది.

కనెక్టివిటీ

రెడ్‌మి నోట్ 10s యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది 4G, వై-ఫై, జిపిఎస్, బ్లూటూత్, IR బ్లాస్టర్, NFC, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. రెడ్‌మి నోట్ 10s లోని సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, యాక్సిలెరోమీటర్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా కలిగి ఉంది. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. కొలతల పరంగా రెడ్‌మి నోట్ 10s 160.46x74.5x8.29mm లతో పాటుగా 178.8 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Redmi 10s Smartphone Receive Up to Rs.2000 Price Drop in India: New Price, Sales Discounts and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X