Redmi 11 Prime 5G ఇండియా లాంచ్ డేట్ ఖరారైంది ! ధర & ఫీచర్లు చూడండి.

By Maheswara
|

Redmi 11 Prime 5G భారతీయ వినియోగదారుల కోసం సిద్ధంగా ఉన్న తాజా లాంచ్‌లలో ఒకటి. Dimensity 700 ప్రాసెసర్, 50MP కెమెరాలు, 5,000 mAh బ్యాటరీ మరియు మరిన్నింటితో సహా అనేక ప్రీమియం ఫీచర్లతో కొత్త Redmi 11 Prime 5G సెప్టెంబర్ 6న లాంచ్ చేయబడుతుంది అని అధికారికంగా ప్రకటించారు. ఈ రాబోయే Redmi ఫోన్ తక్కువ ధరలో సరసమైన 5G స్మార్ట్ ఫోన్ కావచ్చు.

 

Redmi 11 Prime 5G భారతదేశంలో లాంచ్ వివరాలు

గతంలో, Redmi 11 Prime 5G IMEI వెబ్‌సైట్‌లో కనిపించింది, ఇది భారతదేశంలో త్వరలోనే  లాంచ్‌ను నిర్ధారిస్తుంది. Xiaomi ఇప్పటికే Redmi 11 Prime 5G కోసం ప్రత్యేకమైన మైక్రోసైట్‌ను సెటప్ చేసింది, కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కూడా వెల్లడించింది. Redmi యొక్క కొత్త ఫోన్  Redmi 11 Prime 5G కోసం సెప్టెంబర్ 6ని లాంచ్ డేట్‌గా ప్రకటించడానికి కూడా ట్విట్టర్‌లో పంచుకుంది. పూర్తి స్పెసిఫికేషన్లు, ధర మరియు లభ్యత లాంచ్ సమయంలో వెల్లడి చేయబడుతుంది.

Redmi 11 Prime 5G ఫీచర్లు: అంచనా ?

Redmi 11 Prime 5G ఫీచర్లు: అంచనా ?

Redmi 11 Prime 5G కొన్ని నెలల క్రితం ప్రారంభమైన Poco M4 5G యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని నివేదికలు పేర్కొన్నాయి. Poco M4 5G Redmi Note 11E 5G యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పబడింది. రీబ్రాండింగ్ రాబోయే Redmi 11 Prime 5G యొక్క సాధ్యమైన స్పెక్స్‌ను గుర్తించడంలో మనకు సహాయపడుతుంది.

Redmi 11 Prime 5G మైక్రోసైట్ ఫోన్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో ప్రారంభించబడుతుందని ధృవీకరించింది. లీక్ అయిన పోస్టర్లు ఫోన్ యొక్క డిజైన్ ను కూడా వెల్లడిస్తున్నాయి. ఇది సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంటుంది. కుడి వైపు పవర్ మరియు వాల్యూమ్ బటన్లను కలిగి ఉంటుంది.

Redmi 11 Prime 5G
 

Redmi 11 Prime 5G

Redmi 11 Prime 5G యొక్క వెనుక ప్యానెల్ మరింత సొగసైనదిగా కనిపించేలా ఆకృతిలో ఉన్నట్లు అనిపిస్తుంది. మరియు మేము ఈ ఫోన్ ను రెండు రంగుల వేరియంట్‌ల లో ఆశించవచ్చు. వెనుక కెమెరాలు దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌లో ఉంచబడ్డాయి మరియు కొంచెం పొడుచుకు వచ్చినట్లు అనిపిస్తుంది. మైక్రోసైట్ లో చూపిన వివరాల ప్రకారం కొత్త 5G ఫోన్ 50MP డ్యూయల్ కెమెరాలను కూడా నిర్ధారిస్తుంది.

అంచనా ధర

అంచనా ధర

Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ Redmi Note 11Eని పోలిన స్మార్ట్ ఫోన్ అయితే, దీనిని బట్టి  6.58-అంగుళాల FHD+ IPS LCD ప్యానెల్‌ను ఆశించవచ్చు. ఇక ఇతర వివరాలను పరిశీలిస్తే, రాబోయే రెడ్‌మి 11 ప్రైమ్ 5G సరసమైన మధ్య-శ్రేణి ఫోన్‌గా ఉంటుందని మేము ఆశించవచ్చు. దీని ధర రూ. 15,000 నుండి రూ. 18,000 వరకు ఉంటుంది. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Poco M4 5G కి రీ బ్రాండెడ్ వెర్షన్

Poco M4 5G కి రీ బ్రాండెడ్ వెర్షన్

ఇతర రిపోర్ట్ లలో చూపినట్లు ఈ కొత్త Redmi ఫోన్ Poco M4 5G కి రీ బ్రాండెడ్ వెర్షన్ అయితే , Poco M4 5G యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.పోకో M4 5G స్మార్ట్‌ఫోన్ ధరలు & సేల్స్ వివరాలు భారతదేశంలో పోకో M4 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.12,999 కాగా 6GB RAM + 128GB స్టోరేజ్‌ మోడల్ రూ.14,999 ధర వద్ద కూల్ బ్లూ, పవర్ బ్లాక్ మరియు ఎల్లో కలర్ ఆప్షన్‌లలో విడుదలైంది.

పోకో M4 5G స్మార్ట్‌ఫోన్

పోకో M4 5G స్మార్ట్‌ఫోన్

పోకో M4 5G స్మార్ట్‌ఫోన్  డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC, UFS 2.2 స్టోరేజ్, 6GB ర్యామ్ మరియు టర్బో ర్యామ్ వంటి అద్భుతమైన ఫీచర్‌లను కలిగి ఉంది. అదనంగా ఇది సున్నితమైన కార్యకలాపాల కోసం 2GB స్టోరేజ్ ను RAMగా తీసుకుంటుంది. పోకో M4 5G కొత్త ఫోన్ యొక్క వెనుక ప్యానెల్‌ "హిప్నోటిక్ స్విర్ల్ డిజైన్" ను కలిగి ఉండి ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP52 రేటింగ్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
Redmi 11 Prime 5G Launch Date Confirmed In India. Expected Features And Other Details Are Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X