Redmi 12 4G, 5G స్మార్ట్‌ఫోన్లు విడుదల.. స్పెసిఫికేషన్లు, ధర, సేల్ వివరాలు..!
Redme 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఇవాళ భారత్‌లో విడుదల అయ్యాయి. 4G, 5G వేరియంట్లలో లాంచ్ అయ్యాయి. రెడ్‌మీ 12 4G వేరియంట్ మీడియోటెక్ హీలియో SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అదే రెడ్‌మీ 5G వేరియంట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఈ రెండు ఫోన్లు 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆధారిత MIUI 14 OSపై పనిచేస్తాయి.
రెడ్‌మీ 12 4G, రెడ్‌మీ 12 5G స్మార్ట్‌ఫోన్లు 6.79 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. 1080*2460 పిక్సల్‌తో వస్తాయి. అలాగే 90Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటాయి. 450nits బ్రైట్‌నెస్‌తో వస్తాయి. డిస్‌ప్లే స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో రానుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌పై పనిచేయనున్నాయి.

రెడ్‌మీ 12 4G స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో G88 SoC ప్రోసెసర్‌ను కలిగి ఉంటుంది. 12GB వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో సెన్సార్‌లను కలిగి ఉంటుంది. ముందువైపు 8MP కెమెరాతో వస్తుంది. డిస్‌ప్లే పంచ్ హోల్ వద్ద ముందు కెమెరా ఉంటుంది.
రెడ్‌మీ 12 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. 1TB వరకు అంతర్గత స్టోరేజీని పెంచుకొనే వీలుంది. అలాగే 16GB వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు 8MP కెమెరాతో వస్తుంది. డిస్‌ప్లే పంచ్ హోల్ వద్ద ముందు కెమెరా ఉంటుంది.
రెడ్‌మీ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 18W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. మరియు రెండు ఫోన్లు WiFi, GPS, బ్లూటూత్, v5,0, NFC, USB టైప్-C కనెక్టివిటీని కలిగి ఉంటాయి. దీంతోపాటు 3.5 ఆడియో జాక్‌తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటాయి. రెడ్‌మీ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు IP53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తాయి.
Redmi 12 4G ధర : రెడ్‌మీ 12 4G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్+ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999. అదే 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ రూ.11,999గా ఉంది. ఈ రెండు వేరియంట్లపై బ్యాంక్ ఆఫర్ తగ్గింపు కింద రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్లు జేడ్ బ్లాక్, మూన్‌స్టోన్ సిల్వర్, పాస్టెల్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
Redmi 12 4G ధర : రెడ్‌మీ 12 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్+ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999, అదే 6GB ర్యామ్+ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ. 13,499, 8GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,499గా ఉంది. బ్యాంక్ ఆఫర్లుపై రూ.1000 వరకు తగ్గింపును పొందవచ్చు.
ఆగస్టు 4 మధ్యాహ్నం 12 నుంచి రెడ్‌మీ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. రెడ్‌మీ అధికారిక వెబ్‌సైట్, mi హోం, అమెజాన్, ఫ్లిప్‌కార్టు, షియోమీ రిటైల్ దుకాణాల్లో లభిస్తాయి. బ్యాంకు, ఎక్స్చేంజి ఆఫర్ల కింద తగ్గింపును పొందవచ్చని రెడ్‌మీ తెలిపింది.


Click it and Unblock the Notifications








