Home
News

Redmi 12 5G ఫోన్ లాంచ్ తేదీ విడుదలైంది! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు 

By Maheswara

షియోమీ సంస్థ నుంచి Redmi 12 5G ఫోన్ ఇండియా లో మంగళవారం, ఆగస్ట్ 1న లాంచ్ చేయండి తేదీ ఖరారు చేసారు. షియోమీ సబ్ బ్రాండ్ గురువారం (జూలై 27) ఈ విషయం ప్రకటించింది. రెడ్‌మి 12 4G తో పాటు కొత్త 5G స్మార్ట్‌ఫోన్ ను కూడా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. గత ఏడాది ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ ఫోన్ ఇప్పటికే ప్రకటించబడింది.

రెడ్ మీ 12 5G స్మార్ట్ ఫోన్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, పెద్ద డిస్‌ప్లేతో వస్తుందని టీజ్ చేయబడింది. ఇది 8GB RAM మరియు 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజీని కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఇది 5,000mAh బ్యాటరీతో వస్తుందని కూడా సమాచారం. అలాగే, Redmi 12 యొక్క 4G వేరియంట్ విషయానికి వస్తే మీడియా టెక్ G88 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది.

Redmi 12 5G India Launch Date Confirmed For August 1, Leaked Price And Specifications Details Here.

ట్విట్టర్‌లో అధికారిక రెడ్‌మి ఇండియా ఖాతా ద్వారా రెడ్ మీ 12 5G యొక్క తేదీని లాంచ్ తేదీ ని ప్రకటించింది. ఈ ఫోన్‌ను మంగళవారం, ఆగస్టు 1న భారతదేశంలో ప్రకటించనున్నట్లు కంపెనీ టీజ్ చేసింది. రెడ్‌మి కంపెనీ తన వెబ్‌సైట్‌లో డెడికేటెడ్ ల్యాండింగ్ పేజీ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ మరియు కొన్ని స్పెసిఫికేషన్‌లను ఇప్పటికే వెల్లడించింది.

ఈ లీక్ అయిన వివరాల ప్రకారం ఇది మధ్యలో హోల్ పంచ్ కటౌట్ మరియు డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌తో వంపు ఉన్న డిస్‌ప్లేతో వస్తుంది. ఇది Redmi ఫోన్‌లో అతిపెద్ద డిస్‌ప్లే కలిగి ఉంటుందని పేర్కొన్నారు.

రెడ్ మీ 12 5G ఫోన్ 8GB వరకు RAM మరియు గరిష్టంగా 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మూన్‌స్టోన్ షేడ్‌లో లాంచ్ చేయబడుతుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ని ఉపయోగించి స్టోరేజీ ని 16GB వరకు పెంచుకోవచ్చు. ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది.

ఈ రెడ్ మీ 12 5G స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 12R యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు అని అంచనాలున్నాయి. ఇది 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ కోసం CNY 999 (దాదాపు రూ. 11,300) ధర ట్యాగ్‌తో గత నెలలో చైనాలో లాంచ్ చేయబడింది. ఇది హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC ని కలిగి ఉంది మరియు ఇది 6.79 అంగుళాల పూర్తి HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

రెడ్ మీ 12 5G యొక్క లాంచ్ రెడ్ మీ 12 4G ఫోన్ తో పాటుగా జరుగుతుంది. ఈ 4G వేరియంట్ జాడే బ్లాక్, మూన్‌స్టోన్ సిల్వర్ మరియు పాస్టెల్ బ్లూ షేడ్స్‌లో అందించబడుతుందని నిర్ధారించబడింది. ఇది గరిష్టంగా 6GB RAM మరియు 128GB వరకు స్టోరేజీ ని ప్యాక్ చేస్తుంది. ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నట్లు కూడా లీక్ లు చెప్తున్నాయి.

ఈ రెడ్ మీ 12 4G వేరియంట్ ఫోన్ ప్రారంభం లో యూరోప్‌లో 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ కోసం EUR 199 (దాదాపు రూ. 17,000) ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. థాయిలాండ్‌లో, ఇది 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌కు THB 5,299 (దాదాపు రూ. 12,500)కి విడుదలైంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 12 5G India Launch Date Confirmed For August 1, Leaked Price And Specifications Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X