Redmi 12 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. HDFC కార్డు ద్వారా అదనంగా మరో రూ.1000 తగ్గింపు పొందవచ్చు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ ఈ సంవత్సరం ఆగస్టులో రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్‌ను ( Redmi 12 Smartphone ) భారత్ మార్కెట్‌లో విడుదల చేసింది. తాజాగా ఈ ఫోన్ ధరను సంస్థ తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB, 6GB, 8GB ర్యామ్ వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉండగా.. 6GB ర్యామ్ వేరియంట్ ధరను తగ్గించింది.
రెడ్‌మీ 12 ఫోన్‌పై భారీ తగ్గింపు : రెడ్‌మీ సంస్థ ఈ స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ వేరియంట్‌ను రూ.11,999 ధరకు విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వేరియంట్‌పై రూ.1500 తగ్గింపు ధరను ప్రకటించింది. ఫలితంగా రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్ రూ.10,499కు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు HDFC బ్యాంకు కార్డులపైన మరో రూ.1000 డిస్కౌంట్‌ను ప్రకటించింది.

రెడ్‌మీ 12 స్పెసిఫికేషన్ల వివరాలు : ఈ హ్యాండ్ సెట్ 6.79 అంగుళాల FHD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2460*1080 పిక్సల్‌తో రానుంది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3తో రానుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జాడే బ్లాక్, మూన్‌స్టోన్ సిల్వర్ మరియు పాస్టల్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
రెడ్‌మీ 12 కెమెరా ప్రాసెసర్ : రెడ్‌మీ 12 స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో G88 12nm ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 6GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. 128 GB అంతర్గత స్టోరేజీతో వస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 MIUI 14పై పనిచేస్తుంది.

రెడ్‌మీ 12 కెమెరా స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్ కెమెరా, f/2.4 కెమెరాతో 2MP కెమెరాను కలిగి ఉంటుంది. మరియు వెనుకవైపు LED ప్లాష్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ f/2.1 అపేచర్‌తో 8MP కెమెరాను అమర్చారు.
రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వివరాలు : ఈ రెడ్‌మీ 12 హ్యాండ్‌సెట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. IP53 రేటింగ్‌తో డస్ట్ ఫ్రూఫ్‌గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీలతో అందుబాటులో ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








