Home
News

Redmi నుంచి బడ్జెట్‌ రేంజ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్.. 6.74 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ నుంచి త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానుంది. Redmi 13C స్మార్ట్‌ఫోన్‌ త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ గురించి ఇప్పటికే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెడ్‌మీ 13C ఇప్పటికే BIS, ఎన్‌బీటీసీ మరియు IMEIలో నమోదైనట్లు తెలుస్తోంది.

ఈ రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ BIS సర్టిఫికేషన్‌లో మోడల్‌ నంబర్ 23124RN87l ను పొందినట్లు తెలుస్తోంది. దీంతో రెడ్‌మీ 13c భారత్‌లోనూ విడుదల కానుందని తెలుస్తోంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ 10W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది. మరియు 5G నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తుంది.

redmi 13c smartphone

రెడ్‌మీ 13C స్పెసిఫికేషన్లు! : రెడ్‌మీ 13C స్మార్ట్‌ఫోన్‌.. POCO C65 ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా తెలుస్తోంది. ఈ రెడ్‌మీ కొత్త ఫోన్‌ 4G, 5G వేర్వేరు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ త్వరలో చైనాలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అనంతరం ప్రపంచవ్యాప్తంగా లాంచింగ్‌ కానుంది.

రెడ్‌మీ 13C 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100 ప్లస్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అదే 4G వేరియంట్‌ హీలియో G85 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 50MP ప్రైమరీ కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. దాంతోపాటు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.74 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

redmi 13c smartphone

కొన్ని నివేదికల ప్రకారం రెడ్‌మీ 13c స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్‌, గ్రీన్ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు 3 ర్యామ్‌ వేరియంట్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 4GB ర్యామ్‌+ 128GB స్టోరేజీ, 6GB ర్యామ్‌+ 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌+ 256GB స్టోరేజీ వేరియంట్లతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

ఈ ఫోన్ కుడి అంచున వాల్యూమ్ రాకర్‌, పవర్‌ బటన్‌ ఉన్నాయి. ముందు కెమెరా డిస్‌ప్లే పైభాగంలో వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిజైన్‌ను కలిగి ఉంది. అయితే విడుదల తేదీపై స్పష్టత లేనప్పటికి ఈ ఏడాది చివరి నాటికి ఫోన్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అయితే విడుదల తేదీ సహా ఇతర స్పెసిఫికేషన్లపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

redmi 13c smartphone

రెడ్‌మీ 13C స్మార్ట్‌ఫోన్‌తోపాటు ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చిన రెడ్‌మీ నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కూడా త్వరలో భారత్‌ సహా ఇతర దేశాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే నోట్‌ 13 ప్రో విడుదలపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. నోట్‌ 13 ప్రో FCC సర్టిఫికేషన్‌లో నమోదైంది. దీంతో ఈ ఫోన్‌ త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 13C smartphone may launch in india soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X