50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. సేల్ వివరాలు..!
స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు ఇటీవల కాలంలో తన పాత మోడళ్లపై డిస్కౌంట్లను, ధర తగ్గింపును ( Discounts on Smartphones ) ప్రకటన చేస్తున్నాయి. ఈ జాబితాలో శాంసంగ్, నథింగ్, రియల్‌మి, రెడ్‌మీ సహా అనేక సంస్థలు ఉన్నాయి. ఆఫర్లు, డిస్కౌంట్ల ద్వారా పాత మోడళ్ల సేల్స్‌ను పెంచుకోవచ్చని ఆయా సంస్థలు భావిస్తున్నాయి.
తాజాగా రెడ్‌మి సంస్థ తన రెడ్‌మీ 13C స్మార్ట్ ఫోన్ (Redmi 13C Smartphone) ధరను తగ్గించింది. ఈ హ్యాండ్‌సెట్‌ను గత సంవత్సరం డిసెంబర్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో లభిస్తోంది. 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. తాజాగా 4GB ర్యామ్ వేరియంట్ ధరను తగ్గించింది.

రెడ్‌మీ 13C స్మార్ట్ ఫోన్ ధర తగ్గింపు : ప్రస్తుతం రెడ్‌మీ 13C స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499 గా ఉంది. తాజాగా ఈ ఫోన్ ధర (Redmi 13C Smartphone Pricecut) రూ.1000 తగ్గింది. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.7,999 కే కొనుగోలు చేయవచ్చు. మరియు ఈ హ్యాండ్‌సెట్ స్టార్‌డస్ట్ బ్లాక్, స్టార్‌డస్ట్ వైట్, స్టార్‌షైన్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
6.74 అంగుళాల డిస్‌ప్లే, MIUI 14 OS : రెడ్‌మీ 13C స్మార్ట్ ఫోన్ 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. 600 నిట్స్ బ్రైట్‌నెస్ మరియు 12nm హీలియో G85 చిప్‌సెట్ పైన పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS పైన పనిచేస్తుంది.

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ : ఈ రెడ్‌మీ స్మార్ట్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాలను కలిగి ఉంది. ఈ ముందు, వెనుక కెమెరాల ద్వారా 30fps 1080 క్వాలిటీ వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు. ఈ రెడ్‌మీ 13C హ్యాండ్‌సెట్ 18W USB-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
AI ఆధారిత ఫేస్ అన్‌లాక్ : ఈ రెడ్‌మీ 13C హ్యాండ్‌సెట్ డ్యూయల్ సిమ్ కార్డును సపోర్టు చేస్తుంది. మరియు మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు. మరియు భద్రత కోసం AI ఆధారిత ఫేస్ అన్‌లాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తక్కువ ధరలో మెరుగైన అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications