Home
News

Redmi నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 5000 mAh బ్యాటరీ, 6.74 అంగుళాల డిస్‌ప్లే సహా..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ నుంచి Redmi 13C ప్రపంచ వ్యాప్తంగా నవంబర్‌ తొలివారంలో లాంచ్ అయింది. 2022లో లాంచ్‌ అయిన రెడ్‌మీ 12Cకి.. 13C ఫోన్‌ తర్వాత తరం ఫోన్‌గా వచ్చింది. రెడ్‌మీ 13C గ్లోబల్ వేరియంట్‌ 9nm మీడియాటెక్‌ హీలియో G99 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో వస్తుంది.

భారత్‌లో ఈ ఫోన్‌ విడుదలపై సంస్థ ప్రకటన చేసింది. డిసెంబర్‌ 6 రెడ్‌మీ 13cని (Redme 13C launch date) విడుదల చేస్తామని వెల్లడించింది. షియోమీ అధికారిక పేజీ ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ స్టార్‌డస్ట్ బ్లాక్‌, స్టార్‌ షైన్‌ గ్రీన్‌ రెండు రంగుల్లో లభిస్తుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం గ్లోబల్ వేరియంట్‌లో ఉన్న ఫీచర్లు భారత్‌లో అందుబాటులోకి వచ్చే హ్యాండ్‌సెట్‌లో ఉంటాయని తెలుస్తోంది.

redmi 13c

భారత్‌లో విడుదలయ్యే రెడ్‌మీ 13C స్మార్ట్‌ఫోన్‌ 6.74 అంగుళాల HD+ (1800*2460 పిక్సల్‌) LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. మరియు వెనుకవైపు ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో సెన్సార్‌, మరియు ఆక్సులరీ లెన్స్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు 8MP కెమెరా ఉంటుందని తెలుస్తోంది.

5000mAh బ్యాటరీ సపోర్టుతో : రెడ్‌మీ 13C స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MIUI 14 అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌గా రానుందని తెలుస్తోంది. మరియు 18W వైరడ్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సపోర్టుతో రానుందని తెలుస్తోంది. అయితే భారత్‌లో విడుదల అయ్యే రెడ్‌మీ 13C స్మార్ట్‌ఫోన్‌ మిగిలిన స్పెసిఫికేషన్ల వివరాలు ఇంకా తెలియలేదు.

రెడ్‌మీ 13 గ్లోబల్ వేరియంట్‌ క్లోవర్‌ గ్రీన్‌, గ్లేసియర్ వైట్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌, నేవీ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. మరియు 4GB ర్యామ్‌ + 128GB వేరియంట్ ధర భారత కరెన్సీలో సుమారు రూ.11,700గా ఉంది. అదే 6GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర సుమారు రూ. 13,300గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.13800 గా ఉంది.

మిగిలిన ఫీచర్లు : రెడ్‌మీ 13c స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో డిసెంబర్ 6వ తేదీన లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌ కొన్ని స్పెసిఫికేషన్లపైన స్పష్టత వచ్చినా.. మిగిలిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లపైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Redmi 13C smartphone specifications leaked ahead of launch in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X